E-69 Highway: భూమి గుండ్రంగా ఉంటుందని మనకు తెలుసు. భూమి గుండ్రంగా తిరుగుతుంది అనికూడా మనకు తెలుసు. అయినా గురుత్వాకర్షణ శక్తి కారణంగా మనం భూమి తిరిగినా కింద పడం. అయితే ప్రతీ వస్తువుకు అంచులు ఉన్నట్లుగానే భూమికి కూడా అంచులు ఉంటాయి. కానీ అది ఎక్కడ ఉంటుంది అనేది మాత్రం ఎవరికీ తెలియదు. తెలుసుకోవాలన్న ఆసక్తి అందరిలో ఉంటుంది. శాస్త్రజ్ఞులు భూమి చివరి అంచును గుర్తించారు. రోడ్డు ఆ చివరి వరకు వెళ్లి ఆగిపోతుంది. అక్కడే భూమి ఆకాశం కలిసిపోతుంది. అదెక్కడో తెలుసుకుందాం.
ఐరోపాలో ముగింపు..
ప్రపంచంలో ఓ రోడ్డు ఉంటుంది. అది ఒకచోట ముగుస్తుంది. ఆ తర్వాత అనంతంలో కలిసిపోతుంది. జియాలజిస్టులు ఆ స్థానం ఓ దేశంలో ఉండాలని నిర్దేశించారు. ప్రపంచంలోని చివరి రహదారి చిరునామా ఐరోపాలోని జియాలజిస్టులు ఆ రహదారి స్థానాన్ని ఓ దేశంలో ఉండాలని నిర్దేశించారు. ప్రపంచంలోని చివరి రహదారి చిరునామా ఐరోపాలోని ‘E-69 హైవే’ అని చెబుతున్నారు. ఈ E-69 నార్వేలో ఉంది. ఇది ప్రపంచపు రోడ్డు చివరి అంచు అని తేల్చారు. దీంతో ఈ అరుదైన ప్రాంతాన్ని చూడడానికి చాలా మంది అక్కడకి వెళ్తున్నారు. భూమి చివరి అంచుపై ఒక్కసారి అయినా నడవాలని ఇష్టపడుతున్నారు.
ఉత్తర ధ్రువం వద్ద..
భూమి అంచు భూమి ఉత్తరార్ధగోళంలో ఉంది. అంటే భూమధ్య రేఖకు ఎగువన ఉంటుంది. నార్వే దేశంలోని E-69 ఉత్తర ధ్రువం వద్దకు వెళ్తుంది. ఈ రహదారి ఉత్తర ఐరోపాలోని నార్డ్‌కాప్‌ను నార్వేలోని ఓల్డాఫెవోఓర్డ్ గ్రామంతో కలుపుతుంది. ఈ రహదారి పొడవు 129 కిలోమీటర్లు. ఈ మార్గం ఐదు సొరంగాల గుండా వెళ్తుంది. వీటిలో పొడవైన సొరంగం నార్త్‌కేప్. దీని పొడవు 6.9 కిలోమీటర్లు. ఇది సముద్రమట్టానికి 212 మీటర్ల దిగువకు ఉంటుంది. దీనినే చివరి రహదారిగా పిలుస్తున్నారు.
ఈ నిబంధనలు పాటించాలి..
భూమి చివరి రోడ్డుపై వెళ్లాలంటే కొన్ని నియమాలు, నిబంధనలు పాటించాలి. లేదంటే అనుమతి ఇవ్వరు. E-69 ఒంటరిగా వెళ్లేందుకు అనుమతి లేదు. ఎందుకంటే అక్కడ భయంకరమైన వేగంతో గాలి వీస్తుంది. చలి కూడా అధికంగా ఉంటుంది. వేసవికాలంలో కూడా మంచు కురుస్తుంది. ఇక చలికాలంలో రహదారి పూర్తిగా మంచుతో కప్పి ఉంటుంది. భారీ హిమపాతం, వర్షంతో అప్పుడప్పుడు తుపానులు వస్తుంటాయి. వాతావరణ సూచన ఇక్కడ పనిచేయదు. ఈ కారణాలతో అక్కడికి ఒంటరిగా వెళ్లేందుకు అనుమతి ఇవ్వడం లేదు.
నిర్మాణానికి 62 ఏళ్లు..
E-69 హైవేను 1930లో ఐరోపాలోని నార్వేలో నిర్మించాలని శాస్త్రజ్ఞులు ప్రణాళిక రూపొందించారు. అయితే దానిని ఖరారు చేయడానికి మరో నాలుగేళ్లు పట్టింది. అంటే 1934లో రోడ్డు నిర్మాణం ప్రారంభించారు. ఆశ్చర్యం ఏమిటంటే ఈ రోడ్డు నిర్మాణానికి 62 ఏళ్లు పట్టింది. 1992లో నిర్మాణం పూర్తయింది. అయితే, అనంతం వరకు వెళ్లే ఇలాంటి రోడ్లు ప్రపంచంలో చాలానే ఉన్నాయని భూగర్శ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.