African Black Wood: పుష్ప సినిమా చూశారా? ఆ సినిమాలో నటించింనందుక అల్లు అర్జున్ ఏకంగా జాతీయ ఉత్తమనటుడి అవార్డు దక్కించుకు న్నాడు. ఈ దెబ్బకు ఇప్పుడు తాను నటిస్తున్న పుష్ప-2 సినిమా మీద విపరీతమైన హైప్ ఏర్పడింది. ఏకంగా వెయ్యి కోట్లకు అమ్మారని సినిమా ఇండస్ట్రీలో టాక్ విన్పిస్తోంది. పుష్ప-1లో ఎర్రచందనం గురించి, దాని స్మగ్లింగ్ గురించి చెప్పిన సుకుమా ర్.. పుష్ప-2లో ఏం చెబుతారోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పుష్ప సినిమా ఎంట్రీ సీన్‌లోనే ‘ఎర్రచందనం.. ఈభూమ్మిదీ పెరిగే బంగారం’ అని కేశవ నోటితో సుకుమార్ చెప్పిస్తాడు. ప్రతీ సినిమాలో ఏమాత్రం తప్పుల్లేకుండా, ఎటువం టి తప్పిదాలకు వీల్లేకుండా చూసుకుంటాడు సుకుమార్. కానీ అంతటి మ్యాథ్స్ మేథావి ఈ చెట్టు గురించి తెలిసి ఉంటే పుష్ప కథను కచ్చితంగా మార్చేవాడు. ఎర్రచందనం ప్లేస్‌లో ఈ చెట్టును పెట్టేవాడు. కేశవతో మరొరకంగా డైలాగ్ చెప్పించేవాడు. శేషాచలం కాకుండా ఈ ప్రాంతం నేపథ్యంగా సినిమా తీసేవాడు.
సాధారణంగా మన వరకు(ఆఫ్రికా మినహా) ఎర్రచందనం చాలా ఖరీదైన వృక్షజాతి. దీని కలపకు జపాన్, దక్షిణ కొరియా, చైనా ప్రాంతాల్లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. శేషాచలం కొండల్లో ఏం మహత్యం ఉందో తెలియదు గాని అక్కడ విస్తారంగా పెరుగుతుంది. ఒక ఎర్రచందనం చెట్టు కలప పూర్తి స్థాయిలో ఉపయోగపడాలీ అంటే అది తక్కువలో తక్కువ 16 సంవత్సరాల పాటు పెరగాలి. అందులోనూ గుట్ట ప్రాంతంలో అయితే ఇంకా మంచిది. ప్రస్తుతం మార్కెట్‌లో ఎర్రచందనం కిలో 5 నుంచి ఆరు వేల దాకా పలుకుతోంది. మనకు తెలిసినంత వరకు ఇదే అత్యంత ఖరీదైన వృక్షం. కానీ ఆఫ్రికా ఖండంలో దీనిని మించేలా ఓ చెట్టు ఉంది. దానిపేరు ఆఫ్రికన్ బ్లాక్ ఉడ్.
ఈ బ్లాక్ ఉడ్ ఆఫ్రికా ఖండంలోని 26 ప్రాంతాల్లో మాత్రమే లభిస్తుంది. ఈ చెట్టులో కలప ఉపయోగం లోకి రావాలి అంటే 60 సంవత్సరాలు పడుతుంది. చూసేందుకు ఎండిపోయినట్టు కన్పించినప్పటికీ అందులోని కలప నల్లగా ఉంటుంది. దీనిని వివిధ రకాలపై గృహోపకరణాలు, సంగీతపరమైన వస్తువులు తయారు చేస్తారు. అయితే మొదట్లో ఈ చెట్టును పెద్దగా పట్టించుకునేవారు కాదు. రాను రాను డిమాండ్ పెరిగిన నేపథ్యంలో దీని ధర అమాంతం పెరిగింది. కిలో కలప ఽధర బహిరంగ మార్కెట్‌లో 8 లక్షల ధర పలికే స్థాయికి ఎదిగింది. డిమాండ్ పెరిగింది. అంతే కాదు గతంలో 60 ఏళ్ల వయసుకు మించి ఉన్న చెట్లను మాత్రమే నరికేవారు. ఇప్పుడుమాత్రం పదేళ్ల వయసున్న చెట్లను అమాంతం నరికేస్తున్నారు. కాగా, సోషల్ మీడియాలో ఈ చెట్టు గురించి బయటి ప్రపంచానికి తెలియడంతో నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. సుకుమార్‌కు ఈ చెట్టు గురించి ముందే తెలిసి ఉంటే సినిమా కథను పూర్తిగా మార్చేవారని వ్యాఖ్యానిస్తున్నారు.