Creative Advertising: అత్యుత్తమ పోటీతో, వినియోగదారులను ఆకట్టుకునేలా కంపెనీలు ప్రకటనలు ఇస్తూ ఉంటాయి. ఏదేమైనా, గ్రామీణ సెటప్‌లో ఒక పురుషుడు మరియు స్త్రీ ఒక నిర్దిష్ట బ్రాండ్‌ను దాని విలువ మరియు నాణ్యత కోసం మెచ్చుకునే ప్రకటనల కాలం పోయింది. ఇది కొత్త ప్రకటనల యుగం. ఒకప్పుడు పెద్దపెద్ద కంపెనీలకే పరిమితమైన ప్రకటనలకు.. ఇప్పుడు చిన్న చిన్న హోటళ్లు కూడా ప్రాధాన్యత ఇస్తున్నాయి. ప్రచారం ఉన్న వాటిన కొనేందుకే కస్టమర్లు ఆసక్తి చూపుతున్నారు. ఇక హోటళ్లు అంటే.. ప్రచారం తప్పనిసరి. మంచి ఆహారం, వెరైటీ ఉందన్న ప్రచారం జరిగితేనే కస్టమర్లు వస్తారు. ఇందులో కోసం ఓ హోటల్ యజమాని కూడా మిగతా వాళ్లలాగే ప్రచారం చేయాలనుకున్నాడు. అయితే అందరిలా పత్రికలు, టీవీల్లో ప్రకటనలు ఇవ్వకుండా విభిన్నంగా ఆలోచించాడు.
పర్స్‌ను తలపించేలా పాంప్లెట్స్
అందరిలా ప్రకటన ఇస్తే కొంతమందికే చేరుతుంది. కానీ, తన ప్రకటన అందరూ చూడాలని భావించిన ఓ రెస్టరెంట్ యజమాని దానికోసం వినూత్న పద్ధతిని ఎంచుకున్నాడు. రెస్టరెంట్‌కు సంబంధించిన వివరాలు, వెరైటీలు కరపత్రాల్లో ముద్రించారు. తర్వాత వాటిని అందరికీ పంచలేదు. ఇలా పంచితే కూడా వాటిని తీసుకు పడేస్తున్నారు. దీంతో దానికోసం చేసిన ఖర్చు కూడా వృథా అవుతుంది. ఇక కొందరు పాంప్లెట్స్‌ను పల్లీల పొట్లాలకు వాడుతున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని కొత్తగా ఆలోచించి.. పాంప్లెట్స్‌ను పర్సులా ఫోల్డ్ చేశారు. అంతేకాదు. పాంప్లెట్స్‌పై డాల్స్‌ను పోలి ఉండేలా ప్రింట్ చేయించాడు. అవి కొద్దిగా బయటకు కనిపించేలా పాంప్లెట్స్‌ను ఫోల్డ్ చేసి.. జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో పడేయించాడు.
అందరి దృష్టి వాటిపైనే..
రెస్టరెంట్ యజమాని చేసిన వినూత్న ఆలోచన ఫలించింది. ఇలా పర్స్‌లా ఫోల్డ్ చేసిన పాంప్లెట్స్ ఇప్పుడు రోడ్లపై నడుచుకుంటూ వెళ్లేవారిని, వాహనాలపై వెళ్లే వారిని ఆకట్టుకుంటున్నాయి. నిజంగా పరే‍్స అనుకుని తీసుకుంటున్నారు. ఓపెన్ చేసి చూడగానే అందులో రెస్టరెంట్‌కు సంబంధించిన వివరాలు కనిపిస్తున్నాయి. ఇలా పర్స్ పాంప్లెట్స్ కనిపించాగానే ప్రతీ ఒక్కరూ తీసుకుంటున్నారు. అందులోని వివరాలను చదువుతున్నారు.
సోషల్ మీడియాలో వైరల్..
ఈ సరికొత్త యాడ్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు కూడా రెస్టరెంట్ యజమాని ఐడియాను మెచ్చుకుంటున్నారు. ప్రకటన ఇవ్వడమే వినూత్నం అనుకుంటే.. దానిని అందరూ చూడాలనే ఐడియా ఇంకా బాగుందని కామెంట్ చేస్తున్నారు. ఈ ప్రకటన ప్రచారం ప్రజల మనస్సులలో చెరగని ముద్ర వేసింది అని పేర్కొంటున్నారు.
Very good ad 😂https://t.co/6Ve0PeKdfB
— The Figen (@TheFigen_) August 23, 2023