
India Vs Australia: చెన్నై చపాక్ పిచ్ పై భారత బ్యాటర్లు చెలరేగుతారా..? రెండో వన్డేలో అదరగొట్టిన ఆసీస్ కంగారు పెడుతుందా..? సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్లో ఏం జరగబోతుందో. రెండు జట్ల వివరాలు ఇవే.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్లో కీలకమైన మూడో వన్డేలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. చెన్నై చపాక్ స్టేడియం వేదికగా మూడో వన్డే జరుగుతోంది. సిరీస్ ను నిర్ణయించే మ్యాచ్ కావడంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. మొదటి వన్డేలో భారత్ విజయం సాధించగా, విశాఖ వేదికగా జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా జట్టు 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. సిరీస్లో ఇప్పటివరకు ఇరుజట్లు ఒక్కో మ్యాచ్ గెలిచి ఉన్నాయి. మూడో వన్డే గెలిచిన జట్టు సిరీస్ ను కైవసం చేసుకుంటుంది.
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. బ్యాటింగ్
సిరీస్ ను నిర్ణయించే మ్యాచ్ కావడంతో ఇరుజట్లు బలమైన ప్లేయర్లతో బరిలోకి దిగుతున్నాయి. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. డ్రై సర్ఫేస్ ఉండడంతో బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుందని, ఎక్కువ స్కోర్ చేసి భారత్ ముందు ఉంచాలన్న లక్ష్యంతో బ్యాటింగ్ ఎంచుకున్నట్లు స్మిత్ తెలిపాడు. రెండు మార్పులతో బరిలోకి దిగినట్లు స్మిత్ పేర్కొన్నాడు. అస్టన్ అగర్, డేవిడ్ వార్నర్ మూడో వన్డేలో జట్టులో చేరారు.
భారత్ కీలకమైన మ్యాచ్..
మొదటి వన్డేలో తక్కువ స్కోరును చేదించే క్రమంలో వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన భారత్ ను కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా భారీ భాగస్వామ్యంతో జట్టును ఆదుకొని విజయ తీరాలకు చేర్చారు. ఇక రెండో విషయానికి వస్తే ఘోర పరాభవాన్ని భారత జట్టు చవిచూసింది. 117 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియాకు నిర్దేశించిగా ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే ఆస్ట్రేలియా చేదించింది. ఒకరకంగా చెప్పాలంటే రెండు మ్యాచ్ల్లోనూ భారత్ జట్టు ఆటతీరు దారుణంగా ఉందనే చెప్పాలి. కీలకమైన మూడో వన్డేలో అయినా భారత జట్టు మెరుగైన ప్రదర్శన కనబరుస్తుందన్న ఆశతో అభిమానులు ఉన్నారు. ఈ వన్డే గెలుపుతో సిరీస్ కైవసం చేసుకోవచ్చు.

ఇది భారత జట్టు..
మొదటి రెండు వన్డేలకు ఆడిన జట్టుతోనే భారత్ మూడో వన్డే లో బరిలో దిగుతోంది. రోహిత్ శర్మ (కెప్టెన్), సుబ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ (వికెట్ పేపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్.
ఇది ఆస్ట్రేలియా జట్టు..
ఇక ఆస్ట్రేలియన్ జట్టు విషయానికి వస్తే.. డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్స్, స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లబు చేంజ్, అలెక్స్ క్యారీ ( వికెట్ కీపర్), మార్కస్ స్టోయినీస్, ఆస్టన్ అగర్, సీన్ అబాట్, మిచెల్ స్టార్క్, ఆడం జంప.