
Devil First Look: విలక్షణ కథలతో సినిమాలు తీస్తూ సైలెంట్ గా హిట్టుకొట్టేస్తున్నారు కల్యాణ్ రామ్. ఓ వైపు నిర్మాతగా.. మరోవైపు నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఇటీవల ఆయన తీసిన సినిమాలు పేర్లు విభిన్నంగా ఉండడంతో పాటు కథలు కొత్తగా ఉంటున్నాయి. ఆయన నటించి తీసిన ‘బింబిసార’ బ్లాక్ బస్టర్ లిస్టులోకి ఎక్కింది. ఆ తరువాత ‘అమిగోస్’ పై అంచనాలు భారీగానే ఉన్నా ఆకట్టుకోలేకపోయింది. అయితే తాజాగా ఈ హీరో ‘డెవిల్’తో మరో ప్రయోగం చేస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ లో కల్యాణ్ రామ్ అదిరిపోయాడు.
‘డెవిల్’ సినిమా కథ విభిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. ఇందులో భాగంగానే కల్యాణ్ రామ్ లుక్ ను వెరైటీగా డిజైన్ చేశారు. ఈ పోస్టర్ లో కల్యాణ్ రామ్ పంచె కట్టుకున్నారు. కానీ పైన కోట్ వేసుకొని చేతిలో రివాల్వర్ పట్టుకొన్నారు. దీనిని చూస్తే ఇది భారీ యాక్షన్ మూవీనే అని తెలుస్తోంది. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ బ్రిటిష్ ఏజెంట్ గా పనిచేసే వ్యక్తిగా కనిపిస్తారని అంటున్నారు. 1947 సంవత్సరంలో జరిగిన సంఘటనలో ఓ పాయింట్ తీసుకొని దీనిని నిర్మిస్తున్నారు.

దేవాన్ష్ సమర్పణలో నవీన్ మేడారం తీస్తున్న ‘డెవిల్’కు అభిషేక్ నామా నిర్మాత. కల్యాణ్ రామ్ లుక్ ను చూసి నందమూరి ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్ గా ఫీలవుతున్నారు. ఈ లుక్ తో సినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగాయని అంటున్నారు. బింబిసార తరువాత కల్యాణ్ రామ్ ‘డెవిల్’ ను తన సక్సెస్ ఖాతాలో వేసుకుంటారని అనుకుంటున్నారు. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ అనేక సాహసాలు చేసినట్లు తెలుస్తోంది. ఇవే సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని అంటున్నారు.
పాన్ ఇండియా మూవీగా వస్తున్న ‘డెవిల్’ను తెలుగుతో పాటు తమిళం, కన్నడం, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ ఆకట్టుకుంటోంది. వచ్చే వేసవి లేదా దసరాకు సినిమాను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పిరీయాడికల్ మూవీస్ కు కల్యాణ్ రామ్ కు బాగా కలిసొస్తున్నాయి. అందుకే ఈ కథను చెప్పగానే కల్యాణ్ రామ్ వెంటనే ఒప్పేసుకున్నాడట. ఈ సినిమా తరువాత మరో నాలుగు సినిమాలను లైన్లో పెట్టారు.