
India Today Conclave: Ram Charan : బాలీవుడ్ లో గత కొంత కాలం నుండి నెపోటిజం మీద ఒక రేంజ్ లో నెగటివ్ క్యాంపైన్ జరుగుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే.ఈ అంశం పై ఎవ్వరూ కూడా మాట్లాడడానికి సాహసం చెయ్యరు.ఎందుకంటే చాలా సున్నితమైన అంశం ఇది, ఏ చిన్న తేడా కామెంట్ వినిపించిన సగటు సెలబ్రిటీ కి సోషల్ మీడియా లో నెగటివిటీ తప్పదు.ముఖ్యంగా వారసులు దీని గురించి అసలు మాట్లాడలేరు.
సూపర్ స్టార్స్ వారసులు అవ్వడం వల్ల అవకాశాలు మొత్తం వాళ్ళకే వెళ్తున్నాయి అని, ఇండస్ట్రీ లోకి కొత్తగా వచ్చిన వాళ్లకు కేవలం నెపోటిజం వల్లే అవకాశాలు రావడం లేదని,నెపోటిజం ఆగిపోవాలంటూ సోషల్ మీడియా లో ఒక నెగటివ్ క్యాంపైన్ గత మూడేళ్ళ నుండి కొనసాగుతూనే ఉంది.అయితే నేడు ఢిల్లీ జరిగిన ‘ఇండియా టుడే కాంక్లేవ్’ మీటింగ్ కి ముఖ్య అతిధిగా హాజరైన రామ్ చరణ్ నెపోటిజం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు.
బాలీవుడ్ లో ఇప్పుడు నెపోటిజం మీద ఒక రేంజ్ ఉద్యమం జరుగుతుంది..మీరు కూడా నెపోటిజం నుండి వచ్చిన వారే..మీరు దీని గురించి ఏమి అంటారు అని అడగగా రామ్ చరణ్ సమాధానం ఇస్తూ ‘బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి సక్సెస్ అయినా వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.ఒక పెద్ద హీరో ఫ్యామిలీ నుండి వస్తున్నాము అంటే కచ్చితంగా మా మీద విపరీతమైన అంచనాలు ఉంటాయి.
ఆ అంచనాలను అందుకోవడానికి మొదటి సినిమా నుండే మేము కష్టపడాలి, కష్టం మరియు టాలెంట్ ఉంటేనే ఎంత బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన సక్సెస్ అవుతారు.నేను చిరంజీవి గారి అబ్బాయినే అయ్యినప్పటికీ నా టాలెంట్ వల్లే ఇక్కడ దాకా రాగలిగాను’ అంటూ చెప్పుకొచ్చాడు రామ్ చరణ్.ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.మరి దీనిపై బాలీవుడ్ ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో చూడాలి.