Pre Wedding Shoot: పూర్వకాలంలో మనుషులు బట్టలు లేకుండా తిరిగారని చదువుకున్నాం. కాలక్రమంలో నాగరికత పరిణామం చెంది మానవుడు బట్టలు కట్టుకోవడం నేర్చుకున్నాడు. దీంతో మనుషులకు సిగ్గు అనేది ఉంటుందని తెలుసుకున్నాడు. ఇక ఒళ్లు కప్పుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఈ క్రమంలోనే బట్టలు నేయడం నేర్చుకున్నాడు. కట్టుకోవడంపై అవగాహన పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో పలు రకాల కలర్లలో బట్టలు నేసే విద్యను కనిపెట్టాడు. తన అవయవాలు దాచుకునేందుకు పలు మార్గాలు ఎంచుకున్నాడు.

రానురాను రాజుగారి గుర్రం కూడా గాడిదయిందన్నట్లు మనిషి తన నడవడికను కొత్తపుంతలు తొక్కిస్తున్నాడు.
ఇటీవల కాలంలో పెళ్లికి ముందు జంటలు కలుసుకోవడం ఓ సంప్రదాయంగా మారింది. వివాహం చేసుకోవాలనుకునే వారు ముందే తమ అభిప్రాయాలు పంచుకునేందుకు కలుసుకుని తిరుగుతున్నారు. ఫొటో షూట్లుకూడా చేస్తున్నారు. ఇందులో భాగంగా రకరకాల పద్ధతులు పాటించడం మామూలే. వారికి కావాల్సిన పద్ధతుల్లో బట్టలు కుట్టించుకోవడం చేస్తుంటారు. పెళ్లి కి కావాల్సిన సామను కూడా కలిసి కొనుగోలు చేయడం చేస్తుంటారు.
కానీ ఇక్కడో జంట విచిత్రమైన రీతిలో ఫొటో షూట్ లో పాల్గొని అందరిలో ఆశ్చర్యం కలిగించింది.
పెళ్లికి ముందే ఫొటో షూట్ పేరుతో అసభ్యకరంగా నగ్నంగా కనిపించడంతో అందరు అవాక్కవుతున్నారు. వీరి పద్ధతికి అందరు నోరెళ్లబెడుతున్నారు. ఏంటీ పాడుపని అని అసహ్యించుకుంటున్నారు. నాలుగు గదుల్లో చేయాల్సిన పని నడివీధిలో చేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. అది కూడా పెళ్లయ్యాక పరస్పర అంగీకారంతో చేసుకునే పని ఆరుబయట చేయడం అభ్యంతరకరంగా మారింది. ఆ జంట చేసిన పనికి అందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ అవుతోంది.

నాగరికత ముసుగులో ఏం చేస్తున్నారో వారికే అర్థం కావడం లేదు. ఈ నేపథ్యంలో ఈ జంటలు చేసే పనికి అందరు ముక్కున వేలేసుకుంటున్నారు. పెళ్లికి ముందే ఇలా చేస్తే పెళ్లయ్యాక ఇంకా ఏం చేస్తారో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సభ్య సమాజం సిగ్గుపడేలా వ్యవహరిస్తున్న వీరి గురించి అందరు శాపనార్థాలు పెడుతున్నారు. శృంగారం నాలుగు గోడల మధ్య చేసుకుంటేనే మజా. నడిరోడ్డులో చేసుకుంటే ఏముంటుంది బరితెగింపే. వీరి వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో కూడా అందరిలో ఆగ్రహం పెరిగేలా చేస్తోంది. ఇంతకి తెగించిన వారి గురించి అందరు బూతులు తిట్టుకుంటున్నారు.