
Hyderabad Rent Prices: ప్రపంచంలోనే హైదరాబాద్ అత్యంత నివాసయోగ్యమైన నగారాల్లో నిలిచింది. సకల సౌకర్యాలు అనువైన వాతావరణం భాగ్యనగరం సొంతం. దీంతో చాలా మంది హైదరాబాద్ లో ఉద్యోగం, వ్యాపారం చేయడానికి తరలివస్తున్నారు. జనాల తాకిడి రోజోరోజుకు పెరగడంతో ఇక్కడ ఇల్లు అద్దె వ్యాపారం కూడా జోరుగా సాగుతోంది. చిన్న జాగా ఉంటే చాలు. అందులో మూడు ఫ్లోర్ల వరకు నిర్మించి చిన్న చిన్న గదులను అద్దెకు ఇస్తున్నారు. అయితే మిడిల్, అప్పర్ మిడిల్ క్లాస్ కోసం కాస్త విశాలంగానే గదులు నిర్మించారు. ఇటీవల అద్దెకు దిగేవారి సంఖ్య పెరగడంతో వీటి ధరలు విపరీతంగా పెరిగాయి. గతేడాదితో పోలిస్తే 12 శాతం అద్దె ధరలు పెరిగాయని అనరాక్ అనే సంస్థ రీసెర్ఛ్ చేసింది.
ఈ సంస్థ రీసెర్చ్ ప్రకారం.. నగరంలో అత్యంత కాస్ట్లీ నగరంగా హైటెక్ సిటీగా పేర్కొన్నారు. ఇక్కడ 2 బీహెచ్ కే హౌస్ ప్రస్తుతం రూ.26,800 చెబుతున్నారు. గతేడాది ఇది (2022)లో రూ.24 వేలు ఉండేది. ఏడాదిలో 11 శాతం అద్దె రేటు పెరిగింది. అయితే ఇది క్యూ1 లో 1000 చదరపు అడుగులకు వర్తిస్తుంది. ఆ తరువాత గచ్చిబౌలిలో ప్రస్తుతం రూ.25,600 ధర పలుకుతోంది. గతేడాది రూ.23 వేలు ఉండేది. వీటి తరువాత కొండాపూర్ లో అద్దె రేట్లు బాగానే పెరిగాయి. 2022లో కొండాపూర్ లో 2 బీహెచ్ కే ఇంటి అద్దె రూ.21,500 ఉండగా.. ప్రస్తుతం రూ.24000 గా చెబుతున్నారు.
ఇవే కాకుండా వివిధ ప్రైమ్ లోకేషన్లలోనూ అద్దె రేట్లు విపరీతంగా పెరిగాయి. కానీ ఇదే సమయంలో ఇల్ల అమ్మాకలు భారీగా తగ్గాయి. గతంలో అద్దె చెల్లించే బదులు ప్లాట్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపేవారు. కానీ ఇప్పుడు ఆర్థిక మాంద్యం, తదితర కారణాలతో ఇల్లు కొనడానికి వెనుకంజ వేస్తున్నారు. ఏదైనా జాబ్ చేసేవారు, లేదా హైదరాబాద్ లో అవసరమున్నంత వరకు అద్దె చెల్లించి ఉంటున్నారు.

ఇళ్ల అమ్మకాలు విపరీతంగా పడిపోయినా వాటి ధరలు మాత్రం భగ్గుమంటున్నాయి. 2018లో చదరపు అడుగులకు రూ.4128 ఉండేది. 2020నాటికి ఇది రూ.4620కి పెరిగింది. రాను రాను ఇవి మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తంగా ఇళ్ల అమ్మకాలు తగ్గి అద్దె ధరలు పెరగడంతో ఇప్పటికే ఇల్లు ఉన్నవారు లాభాల పంట పండించుకుంటున్నారు.