Inaya Sultana- Revanth: బిగ్ బాస్ సీజన్ 6 అట్టర్ ప్లాప్. దారుణమైన టీఆర్పీ అందుకుంది. అనేక కోణాల్లో షో విమర్శల పాలైంది. టాప్ ప్లేయర్స్ ని ఎలిమినేట్ చేయడం, కొందరికి ఫేవర్ గా ఉంటూ… మరికొందరిని తొక్కేశారనే ప్రచారం గట్టిగా జరుగుతుంది. ముఖ్యంగా రేవంత్ ని విన్నర్ ని చేసేందుకు హోస్ట్ నాగార్జున నుండి నిర్వాహకులకు వరకు పనిగట్టుకొని పని చేశారు అనిపిస్తుంది. సీజన్ విన్నర్ నువ్వే… అనే ఒప్పందంపై రేవంత్ ని హౌస్లోకి పంపారని కూడా వినిపిస్తోంది. సోషల్ మీడియాలో రేవంత్ పై ఫుల్ నెగిటివిటీ నడుస్తుంది. అతడు టైటిల్ కి అర్హుడు కాదంటున్నారు. రోహిత్ లాంటి జెన్యూన్ అండ్ జెంటిల్మెన్ కి ఇవ్వడం న్యాయమని పలువురి అభిప్రాయం.

సోషల్ మీడియాలో రేవంత్ కి ఎలివేషన్స్ ఇచ్చేవారందరూ డబ్బులిచ్చి పెట్టుకున్న పిఆర్లు మాత్రమే. పెద్ద సింగర్ అయి కూడా అతనికి ఆర్గానిక్ ఫ్యాన్స్ లేరు. అలాగే ఈ షోకి వచ్చాక అతని భయానక ప్రవర్తన బయటకు తెలిసింది. అంతకు ముందున్న అభిమానులు కూడా… నెగిటివ్ ఒపీనియన్స్ డెవలప్ చేసుకున్నారు. హౌస్లో రేవంత్ ప్రవర్తన ఎంత దారుణంగా ఉండేదో కంటెస్టెంట్ ఇనయా బయటపెట్టారు.
ఇనయా రేవంత్ కారణంగా తనకు తగిలిన దెబ్బలు, గాయాలు చూపిస్తూ ఆడవాళ్లు అని కూడా చూడకుండా ఎలా కఠినంగా వ్యవహరించాడో వివరించింది. స్ట్రాప్స్ టాస్క్ లో రేవంత్ నా గొంతు చేతులలో నొక్కేశాడు. కాలు పట్టుకొని కొంత దూరం ఈడ్చుకెళ్లాడు. ఎత్తి నేలకేసి కొట్టారు. ఆ టాస్క్ లో రేవంత్ చేసినవి చూపించలేదు. రేవంత్ కారణంగా నా ఒంటి నిండా గాయాలు అయ్యాయి. మేకప్ వేసుకున్నా మీకు కనిపిస్తున్నాయి. ఇంకా లోపల చాలా దెబ్బలు తగిలాయి. అవేమీ చూపించడం లేదు, అని ఇనయా వెల్లడించింది.

రేవంత్ తో గొడవ పడ్డ వాళ్ళను తప్పుగా చూపిస్తున్నారని ఇనయా ఆవేదన చెందింది. రేవంత్ కి ఎదురెళితే ఎలిమినేట్ అవుతారట కదా? అని యాంకర్ అడుగగా, అది నాకు తెలియదు అన్నారు. యాంకర్ అనుమానం నిజమే. రేవంత్ హౌస్లో దారుణాలు చేస్తున్నారు. అవి ఎందుకు చూపించరు. ఎందుకు ప్రశ్నించడం లేదని ఫైమా నామినేషన్స్ లో గట్టిగా ప్రశ్నించింది. ఆ నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యింది. మొదటి నుండి రేవంత్ ఇతర కంటెస్టెంట్స్ ని చులకనగా చూస్తూ, భయపెడుతూ ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. గేమ్ లో అగ్రేషన్ ఉండాలని హోస్ట్ నాగార్జున అతన్ని ఎంకరేజ్ చేయడం… దుర్మార్గానికి పరాకాష్ట.