Unstoppable With NBK 2- Pawan Kalyan: ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ సీజన్ 2 చివరి ఎపిసోడ్ షూటింగ్ నిన్న హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ జరిగింది..ఈ ఎపిసోడ్ కి ముఖ్య అతిథిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరయ్యాడు..ఉదయం 9 గంటలకు షూటింగ్ ప్రారంభం అవ్వగా సాయంత్రం 7 గంటల వరకు కొనసాగింది..బాలయ్య బాబు పవన్ కళ్యాణ్ తో చేసిన చిట్ చాట్ హైలైట్ గా నిలిచింది..వీళ్లిద్దరు బయట కలుసుకున్న సందర్భాలు చాలా తక్కువ.

ఒకటి రెండు సార్లు కొన్ని ఫంక్షన్స్ కి హాజరైనప్పుడు కలుసుకున్నారు కానీ..ప్రత్యేకంగా సమావేశం అవ్వడం ఎప్పుడు జరగలేదు..అంతే కాకుండా పవన్ కళ్యాణ్ కూడా ఇలా పబ్లిక్ గా టాక్ షోస్ కి రావడం గతం లో ఎప్పుడు కూడా జరగలేదు..ఇదే మొట్టమొదటిసారి..దీనితో ఈ ఎపిసోడ్ పై జనాల్లో ఒక రేంజ్ క్రేజ్ ఏర్పడింది..ఇక ఈ ఎపిసోడ్ కి సంబంధించిన కొన్ని హైలైట్స్ ఇప్పుడు మేము మీ ముందు ఉంచబోతున్నాము.
ముందుగా బాలయ్య బాబు పవన్ కళ్యాణ్ 3 వివాహాల ప్రస్తావన తీసుకొస్తాడు..’ఈ పెళ్లిళ్ల గోల ఏంటయ్యా’ అని అడుగుతాడు..అప్పుడు పవన్ కళ్యాణ్ తాను మూడు పెళ్లిళ్లు ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో వివరణ ఇస్తాడు..అదంతా విన్న తర్వాత బాలయ్య బాబు ‘ఇంత క్లారిటీ వివరణ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా కామెంట్స్ చేసారంటే వాళ్ళు ఊరకుక్కలతో సమానం’ అంటూ ఆయన వైసీపీ పార్టీ నాయకులపై పరోక్షంగా విమర్శలు గుప్పించాడు..ఈ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ తో పాటుగా సాయి ధరమ్ తేజ్ హాజరయ్యాడు.

ఆ తర్వాత ఫోన్ కాల్ లో రామ్ చరణ్ మరియు త్రివిక్రమ్ తో మాట్లాడుతాడు పవన్ కళ్యాణ్..కొసమెరుపు ఏమిటంటే చివర్లో బాలయ్య బాబు కొడుకు మోక్షజ్ఞ ఎపిసోడ్ మధ్యలో వచ్చి పవన్ కళ్యాణ్ తో ఫోటో తీసుకొని వెళ్తాడు..ఇది ఈ షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది..అలా ఆద్యంతం ఆసిక్తికరంగా మరియు వినోదభరితంగా సాగిపోయిన ఈ ఎపిసోడ్ సంక్రాంతి కానుకగా లైవ్ టెలికాస్ట్ కాబోతుంది.