https://oktelugu.com/

Viral Video : కాళ్లతో వంట.. ఈ ఆహారం విద్యార్థులు తినాలంట.. వైరల్ వీడియో

హర్యానా లోని ఒపి జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ విద్యార్థులు తమ క్యాంపస్ క్యాంటీన్లో ఫుడ్ తినడం మానేశారు. అందుకు కారణం ఇదిగో ఇలాంటి దృశ్యం చూసి క్యాంటీన్లో ఫుడ్ తినడం మానేశారు.

Written By:
  • NARESH
  • , Updated On : September 1, 2023 / 05:39 PM IST

    cooking with legs

    Follow us on

    Viral Video : హాస్టల్ ఫుడ్స్ అంటేనే ఓ రకమైన వికారం.. ఓ ఉప్పు ఉండదు.. కారం ఉండదు.. చప్పడి కూరు. మన ఇంట్లో చేసుకునే కూరగాయలు ఏవీ అక్కడ ఉండవు. చీప్ గా దొరికేవి. జనాలు ఎవ్వరూ తినని వాటిని భోజనంగా వండేస్తారు. అందుకే స్టూడెంట్స్ ఎవరూ క్యాంటీన్ లో తినడానికి అస్సలు ఆసక్తి చూపించారు. తాజాగా ఓ హాస్టల్ లో విద్యార్థులకు ఆహారాన్ని తయారు చేయడానికి కాళ్లను ఉపయోగించిన వైనం విస్తుగొలుపుతోంది. ఈ వీడియో వైరల్ అవుతోంది.

    హర్యానాలోని ఒక ప్రైవేట్ యూనివర్సిటీ క్యాంటీన్ వారి తంతు.. ఆలుగడ్డలు ఉడికించిన తరువాత కాళ్ళతో తొక్కుతున్న క్యాంటీన్ సిబ్బంది వైనాన్ని విద్యార్థులు కెమెరాతో చిత్రీకరించి వారిని పట్టించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది.

    హర్యానా లోని ఒపి జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ విద్యార్థులు తమ క్యాంపస్ క్యాంటీన్లో ఫుడ్ తినడం మానేశారు. అందుకు కారణం ఇదిగో ఇలాంటి దృశ్యం చూసి క్యాంటీన్లో ఫుడ్ తినడం మానేశారు.

    ఎంత దారుణం అంటే ఆలుగడ్డలను ఉడికించి వాటిని మెత్తగా చేసేందుకు ఏకంగా ఆ పాత్రలోకి దిగి కాళ్లతో తొక్కేస్తున్నాడు ఓ వంట మనిషి. ఇలా కాళ్లతో తొక్కి విద్యార్థులకు పెడుతున్న వైనాన్ని వాళ్లు కనిపెట్టారు. ఇంకేముంది వీడియోను తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది. యూనివర్సిటీ క్యాంటీన్ గుట్టు బయటపడింది.