https://oktelugu.com/

PM Modi : మోడీ వంట గ్యాస్ సబ్సిడీ తాయిలం కాదని ఎంతమందికి తెలుసు?

ఈ జూలై నెలలో ద్రవ్యోల్బణం 7.50 శాతం పెరిగింది. మోడీ సర్కార్ సరాసరిగా 3శాతాన్ని కొనసాగించింది. కానీ కరోనా ప్రపంచ ఆర్థికమాంద్యంతో ఈ రెండేళ్లలో పెరిగింది..

Written By:
  • Neelambaram
  • , Updated On : September 1, 2023 / 06:10 PM IST

    PM Modi  : ప్రధానమంత్రి మోడీ ఇటీవల వంట గ్యాస్ ధర రూ.200 తగ్గించారు. సబ్సిడీ ఇచ్చారు. ఉజ్వల గ్యాస్ లబ్ధిదారులకు రూ.400 తగ్గించారు. మోడీ సర్కార్ తగ్గింపు ఎవరు పడితే వారు కామెంట్ చేసుకుంటూ వెళ్లిపోయారు. శేఖర్ గుప్తా కూడా ఇదేదో ఎన్నికల తాయిళాలుగా చెప్పుకొచ్చాడు. ఇది ఎన్నికల తాయిళం అయితే అయ్యిండొచ్చు.

    ఎన్నికల బరిలోకి రాజకీయం చేయకుండా ఏ రాజకీయ పార్టీ ఉండదు. ఉచిత పథకాలకు వ్యతిరేకం అని చెప్పుకొచ్చే మోడీ .. ఇప్పుడు ఎందుకు ఈ నిర్ణయం తీసుకొని ధరలు తగ్గించాడన్నది ప్రశ్న. కానీ మోడీ ఇలా చేయడం వెనుక ఆ ఆలోచన లేదని చెప్పొచ్చు.

    ఆగస్టు 15 ఎర్రకోట నుంచి మాట్లాడినప్పుడే దీనికి సంకేతాలిచ్చారు. దేశంలో అన్నీ బాగానే ఉన్నాయి. కోవిడ్ మహమ్మారిని మనం దిగుమతి చేసుకున్నాం.. పరిష్కరించుకోగలిగాం.. కానీ వాటితోపాటు ప్రపంచ సంక్షోభాన్ని దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని.. ధరల పెరుగుదల సమస్యగా మారింది. ఇదే మనకు పెద్ద సవాల్ అని చెప్పుకొచ్చాడు.

    ఈ జూలై నెలలో ద్రవ్యోల్బణం 7.50 శాతం పెరిగింది. మోడీ సర్కార్ సరాసరిగా 3శాతాన్ని కొనసాగించింది. కానీ కరోనా ప్రపంచ ఆర్థికమాంద్యంతో ఈ రెండేళ్లలో పెరిగింది..

    మోడీ వంట గ్యాస్ సబ్సిడీ తాయిలం కాదని వివరిస్తూ ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.