IMCCCI Report: కాలం మారుతున్న కొద్ది టెక్నాలజీ మారిపోతుంది. అయితే ఈ టెక్నాలజీని కొందరు అవసరానికి కాకుండా సరదా కోసం ఉపయోగించుకుంటున్నారు. అందరికీ సరదా ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. కానీ రేపటి భావితరాన్ని తీర్చిదిద్దే యువతకు మాత్రం నష్టాన్ని తీసుకొస్తుంది. ఎందుకంటే చాలామంది యువత చదువుపై కంటే ఎక్కువ సోషల్ మీడియాపైనే దృష్టిపెడుతోంది. ఉదయం నుంచి రాత్రి వరకు మొబైల్ తోనే జీవితం గడిపేవారు చాలామంది ఉన్నారు. మీరు ఎక్కువగా భవిష్యత్తు జీవితం గురించి ఆలోచించకుండా ప్రస్తుతం ఉన్న సరదా కోసం మాత్రమే పాటుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కన్సల్టెన్సీ స్పాట్ సోషల్ ఇండెక్స్ అనే సంస్థ ఒక అధ్యయనం చేసింది. ఈ నివేదిక ప్రకారం యువత ఎక్కువగా సోషల్ మీడియా పైనే ఆధారపడుతోందని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..
Also Read: ఆ గ్రామాల్లో స్థిరపడితే రూ.92 లక్షల బహుమతి.. ఈ ఆఫర్ ఇటాలియన్లకే..!
ప్రతి ఒక్కరి జీవితంలో నేటి కాలంలో సోషల్ మీడియా ప్రధాన భాగం అయిపోయింది. ఎటువంటి సమాచారం అయినా తెలుసుకోవడానికి చాలామంది దీనిని ఫాలో అవుతున్నారు. విద్యార్థుల నుంచి బడా వ్యాపారుల వరకు సోషల్ మీడియాతోనే కాలం గడుపుతున్నారు. అయితే ఒక రకంగా సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందుతుంది. కానీ సమాచారం కోసం కాకుండా సరదా కోసం ఉపయోగించే వారే ఎక్కువ అవుతున్నారు. సోషల్ మీడియా లేకుండా అసలు జీవితమే లేదు అన్నట్టు ప్రవర్తిస్తున్నారు.ముఖ్యంగా యువత చదువు భవిష్యత్తు గురించి ఆలోచించకుండా సోషల్ మీడియాతోనే కాలక్షేపం చేస్తున్నారు.
IMCCCI విడుదల చేసిన నివేదిక ప్రకారం.. సోషల్ మీడియాపై యువత 90% ఆధారపడుతోందని పేర్కొంది. అయితే వీరు ఎక్కువగా సరదా కోసం మాత్రమే ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగాల కోసం చదువు సమాచారం కోసం కాకుండా ఫ్యాషన్, మార్కెటింగ్ గురించే ఎక్కువగా తెలుసుకుంటున్నారు. అలాగే వీరిలో సోషల్ మీడియాను పక్కనుంచి కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేసే వారిలో 68 శాతం మంది ఉన్నారు. 60 శాతం మంది టీవీ యాడ్స్ చూస్తున్నారు. డిజిటల్ మీడియాను ఆశ్రయించే వారిలో 54 శాతం మంది ఉన్నారు. పత్రికలు చూసేవారు 23 శాతం మంది ఉన్నారు.
మొత్తంగా చూస్తే ఏ సమాచారం కోసమైనా ఎక్కువగా సోషల్ మీడియా అనే ఎక్కువగా ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సోషల్ మీడియాలో మార్కెటింగ్ గురించి రెండు గురించి ఎక్కువగా తెలుసుకుంటున్నారు. ఇదే సమయంలో విద్య గురించి భవిష్యత్తు గురించి తెలుసుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కొందరు నిపుణులు తెలుపుతున్నారు. అలాకాకుండా మార్కెట్లో ఉండే కొత్త వస్తువుల గురించి ఫ్యాషన్ గురించి తెలుసుకుంటున్నారు. ఇంకొందరు సోషల్ మీడియాలో ఆకర్షించే కొన్ని ప్రకటనలను స్పందించి వెంటనే వస్తువులు కొనుగోలు చేసేవారు ఉన్నారు. అంటే సాధారణ మాధ్యమాల కంటే సోషల్ మీడియా ద్వారా మార్కెటింగ్ ఎక్కువగా ప్రచారం ఉంటుందని తెలుస్తోంది. అయితే యువత సోషల్ మీడియాపై ఆధారపడకుండా కెరీర్ పై దృష్టి పెట్టాలని కొందరు సూచిస్తున్నారు. ఇదే సమయంలో భవిష్యత్తు లో ఉండే చదువులు లేదా ఉద్యోగాల గురించి ప్రకటనలు చూసేవారి సంఖ్య తక్కువగానే ఉందని అంటున్నారు.