Iliana : హీరో రామ్ మొదటి సినిమా దేవదాసు చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా హీరోయిన్ ఇలియానా తొలి సినిమానే భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో టాలీవుడ్ లో బడా హీరోలు మరియు నిర్మాతల దృష్టిలో పడింది.. ఆ సినిమా తర్వాత పూరి జగనాథ్ ఆమె దగ్గర 20 రోజుల కాల్ షీట్స్ ని తీసుకొని ‘పోకిరి’ అనే సినిమా తీసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు.. ఈ సినిమా తర్వాత ఇలియానాకి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.. సౌత్ లో ఉన్న క్రేజీ స్టార్ హీరోలందరితో నటించింది.. అంతే కాకుండా సౌత్ నుండి మొట్టమొదటి కోటి రూపాయిల పారితోషికం అందుకున్న హీరోయిన్ గా ఇలియానా అప్పట్లో చరిత్ర సృష్టించింది.. ఈమెకి సౌత్ లో మిగిలిన హీరోయిన్స్ తో పోలిస్తే సక్సెస్ రేట్ తక్కువే.

అయినా కూడా ఆమెతో సినిమాలు చెయ్యడానికి క్యూ కట్టేవాళ్ళు దర్శక నిర్మాతలు.. ఎంత రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిన ఇచ్చేవాళ్ళు.. అందుకు కారణం యూత్ లో ఇలియానా కి ఉన్న క్రేజ్ వల్లే అని చెప్పొచ్చు.. కెరీర్ పీక్ రేంజ్ లో ఉండగానే ఈమె టాలీవుడ్ ని వదిలి బాలీవుడ్ కి వెళ్ళిపోయింది.. కాస్త క్రేజ్ రాగానే టాలీవుడ్ ని మర్చిపోయి బాలీవుడ్ కి వెళ్ళిపోయింది అంటూ అప్పట్లో ఇలియానాపై కొంతమంది విరుచుకుపడ్డారు.. కానీ ఆమె టాలీవుడ్ ని వదిలి వెళ్ళడానికి కారణం అది కాదు.. వేరే ఉంది.
ఇక అసలు విషయానికి వస్తే ఆ రోజుల్లో ఇలియానా ఒక ప్రముఖ స్టార్ హీరోతో ప్రేమాయణం నడిపి డేటింగ్ చేసింది.. ఆ సమయంలో ఆమె గర్భం దాల్చింది.. ఇక ఇంట్లో చెప్పి అధికారికంగా పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు ఆ హీరో. కానీ హీరో కుటుంబ సభ్యులు మాత్రం ఆ పెళ్ళికి ఒప్పుకోలేదు.. ఒప్పించడానికి చాలా ప్రయత్నం చేసాడు.. ఆ హీరో కుటుంబానికి ఎంతో సన్నిహితుడైన ఒక ప్రముఖ టాప్ నిర్మాతతో కూడా మధ్యవర్తిత్వం చేయించి ఒప్పించే ప్రయత్నం చేసాడు.. కానీ ఆ ప్రయత్నాలు అన్నీ విఫలం అయ్యాయి..
ఇక చేసేది ఏమిలేక ఇలియానా ని దూరం పెట్టేసాడు ఆ హీరో.. ఇదంతా అర్థం చేసుకున్న ఇలియానా అబార్షన్ చేయించుకొని టాలీవుడ్ నుండి శాశ్వతంగా దూరమై బాలీవుడ్ లో స్థిరపడింది.. అయితే ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల ఒత్తిడి చెయ్యడంతో ఆయన కోరిక కాదనలేక చాలా కాలం తర్వాత ఆమె రవితేజ హీరో గా నటించిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది.. ఈ చిత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది.. ఆ తర్వాత ఆమె మళ్ళీ తెలుగులో రాలేదు.. బాలీవుడ్ లో కూడా ఈమెకి ప్రస్తుతం అవకాశాలు తక్కువే.. ఆడపడడపా పలు వెబ్ సిరీస్ లలో మాత్రమే నటిస్తుంది ఇలియానా.