
Cumin Benefits: సుగంధ ద్రవ్యాలకు పుట్టినిల్లు మనదేశం. మనదేశంలో లభించే సుగంధ ద్రవ్యాలకు పాశ్చాత్యులు సైతం ఎంతో ఇష్టపడేవారు. వాస్కోడిగామా మన దేశానికి వచ్చి ఇక్కడ పండించిన సుగంధద్రవ్యాలను చూసి వారి దేశానికి తీసుకుపోయి అక్కడ పరిచయం చేశాడు. అలా మనకు సుగంధ ద్రవ్యాలు పండించే ఆచారం ఇప్పటిది కాదు. సుగంధ ద్రవ్యాలలో ముఖ్యమైనది జీలకర్ర. ఇది మన ఆరోగ్యానికి ఎంతో దోహద పడుతుంది. అందుకే రోజువారీ ఆహారంలో జీలకర్ర లేనిదే కూరలు వండుకోం. అది వేస్తే ఆ వాసన వేరుగా ఉంటుంది. మంచి సువాసనతో కూర ఇంపుగా అవుతుంది. అంతటి మహత్తర శక్తి జీలకర్రకు ఉంది. అందుకే దీన్ని మన వంటల్లో విరివిగా వాడుతుంటాం.
ఆరోగ్య ప్రదాయిని
జీలకర్ర మన ఆరోగ్య ప్రదాయినిగా నిలుస్తుంది. జీర్ణకోశ, శ్వాస కోశ వ్యాధులకు ఇది మంచి మందుగా పని చేస్తుంది. ఇంకా సంతాన ప్రత్యుత్పత్తి వ్యవస్థపై చెడు ప్రభావాలను తొలగించేదిగా ఉంటుంది. మన ఇళ్లల్లో తాళింపులో జీలకర్రను ఎక్కువగా వాడుకుంటాం. మంచి వాసనతో కూరను రుచిగా చేయడంలో మేటిగా ఉంటుంది. మసాలా దినుసలలో జీలకర్రకు ఎంతో ప్రాధాన్యం ఉంది.
కల్తీని కనిపెట్టాలి
జీలకర్ర వాసన అమోఘంగా ఉంటుంది. మార్కెట్లో కల్తీవి కూడా అమ్ముతున్నారు. మనం వాసన చూసి కనిపెట్టొచ్చు. జీలకర్రను నలిపి వాసన చూస్తే మనకు మంచి వాసన వస్తేనే కొనుక్కోవాలి. లేదంటే మానేయాలి. స్వచ్ఛమైన వాసన వస్తే మనకు వికారాలు, వాంతులు కూడా తగ్గిస్తుంది. జీలకర్రలో ఉండే గుణాలు తెలిస్తే ఎవరు కూడా దాన్ని వదిలిపెట్టరు. అంతటి మంచి పోషకాలు ఉన్న ఆహారాల్లో జీలకర్ర కూడా ఒకటి కావడం గమనార్హం. అందుకే మనం రోజు కూరల్లో జీలకర్ర ఉంచుకోవడం సముచితం.
జీలకర్ర రెండు రకాలుగా..
జీలకర్ర రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి నల్ల జీలకర్ర. ఇది ఆయుర్వేదంలో వాడతారు. రెండోది మనం కూరల్లో వేసుకునేది. ఇది అందరు వాడేది. ఆయుర్వేదం ప్రకారం కూడా నల్ల జీలకర్రతో ఎన్నో రకాల వ్యాధులకు మందులా పనిచేస్తుంది. మనం రోజు వాడే జీలకర్రతో కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు దాగి ఉన్నాయి. జీలకర్రను నలిపి వాసన చూస్తే సరి వాంతులు తగ్గుతాయి. లేదా కొద్దిగా నీళ్లల్లో వేసుకుని తాగినా అజీర్తి సమస్య పోతుంది. ఉదర సంబంధ వ్యాధులకు జీలకర్ర అద్భుతమైన మందులా పనిచేస్తుంది.

మజ్జిగలో కలుపుకుని..
జీలకర్రను కారంగా చేసుకుని కూడా రోజు తినొచ్చు. మజ్జిగలో కలుపుకుని తాగొచ్చు. కడుపుకు సంబంధించిన సమస్యలు దూరం చేయడంలో ఇది ఉపయోగపడుతుంది. అందుకే మనం రెగ్యులర్ గా జీలకర్రను వాడుకుంటే ఎంతో ఉత్తమం. మన అనారోగ్య సమస్యలను దూరం చేయడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. జీలకర్ర వాడటం వల్ల మనకు మేలు కలుగుతుంది కానీ కీడు మాత్రం జరగదు. అందరు విధిగా జీలకర్రను ఆహారంగా తీసుకుని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.