Demise Certificate: ప్రసార మాధ్యమాలు వచ్చాక కొన్ని ప్రత్యేకతలు చోటుచేసుకుంటున్నాయి. ప్రతి వ్యక్తి మరణించిన తరువాత మరణ ధృవీకరణ పత్రం ఇస్తుంటారు. ఎక్కడ చనిపోతే అక్కడే ఇస్తారు. గ్రామాల్లో చనిపోతే గ్రామపంచాయతీ, ఆస్పత్రుల్లో మరణిస్తే అక్కడే మరణధృవీకరణ పత్రాలు ఇస్తుంటారు. దీంతో వీటితో పలు ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన పనులు సాగాలంటే డెత్ సర్టిఫికెట్ అవసరమే. దీంతో ప్రతి వ్యక్తి చనిపోయాక డెత్ సర్టిఫికెట్ ఇవ్వడం మామూలే. కానీ ఇక్కడో గమ్మత్తైన విషయం జరిగింది. తాజాగా అతడి డెత్ సర్టిఫికెట్ పోయిందని అతడే పేపర్ లో ప్రకటన ఇవ్వడం సంచలనంగా మారింది.

నాగాన్ లోని లుమ్డింగ్ బజారు వద్ద ఈ నెల 7న ఉదయం 10 గంటలకు తన డెత్ సర్టిఫికెట్ పోయిందని అస్సాంకు చెందిన రంజిత్ కుమార్ పేరిట పేపర్ లో ప్రకటన వచ్చింది. దీంతో దీన్ని ఓ ఐపీఎస్ అధికారి ట్విట్టర్ లో పోస్టు చేయడంతో వివాదాస్పదమైంది. తన డెత్ సర్టిఫికెట్ పోయిందని తానే స్వయంగా ప్రకటన ఇవ్వడం సంలనం కలిగించింది. అతడు చేసిన పనికి సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇలాంటి వింతలు కూడా జరగడం మామూలు కాకపోయినా అతడు ఎందుకు ఇలా చేశాడో ఎవరికి అర్థం కావడం లేదు.

తన డెత్ సర్టిఫికెట్ కోసం తానే ప్రకటన ఇవ్వడంతో నెటిజన్లు కూడా పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. డెత్ సర్టిఫికెట్ దొరికితే ఎక్కడికి పంపాలని అడుగుతున్నారు. స్వర్గానికా? నరకానికా? అని వింత ప్రశ్నలు వేస్తున్నారు. దీంతో అతడు చేసిన పనికి అందరు ఆశ్చర్యపోతున్నారు. లోకంలో ఇలాంటి వారు కూడా ఉంటారా? అనే కోణంలో పలు కామెంట్లు వస్తున్నాయి. మొత్తానికి ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా అనే సందేహాలు వస్తున్నాయి. తన డెత్ సర్టిఫికెట్ పోయిందని పేపర్ లా యాడ్ ఇవ్వడంతో అందరిలో పలు ప్రశ్నలు వెలుగు చూస్తున్నాయి.
ప్రసార మాధ్యమాలు కొత్త పుంతలు తొక్కుతున్న నేటి కాలంలో కూడా ఇలాంటి ప్రకటనలు రావడం వింతేమీ కాదు. కానీ తన డెత్ సర్టిఫికెట్ గురించి తానే ప్రకటన ఇచ్చుకుని అందరిలో కొత్త అనుమానాలు కలిగించాడు. ఇంతకీ అతడు ఎందుకు ఈ ప్రకటన ఇచ్చాడనే విషయం తేలడం లేదు. భవిష్యత్ లో ఇంకా ఎలాంటి వివాదాస్పద విషయాలు చూడాల్సి వస్తోందోనని అందరు కంగారు పడుతున్నారు. ఈ క్రమంలో జరిగిన వింత సంఘటనకు ఏం పరిణామాలు చోటుచేసుకుంటాయో తెలియడం లేదు.