
Pumpkin: తెలుగు సంవత్సరాది ఉగాదిని నేడు జరుపుకుంటున్నాం. సృష్టికర్త బ్రహ్మ ఈ రోజు సృష్టిని ప్రారంభించాడని చెబుతుంటారు. యుగానికి ఆరంభంగా ఉగాదిని జరుపుకోవడం ఆనవాయితీ. ఈ పండుగ రోజు ఉదయాన్నే స్నానం చేసి కొత్త బట్టలు ధరించి దేవుడిని ప్రార్థించడం కలిసివస్తుంది. దీంతో ఉగాది పంచాంగ శ్రవణం చేస్తుంటారు. ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు వస్తుంటాయో తెలుసుకోవడం కోసం అందరు దేవాలయాలను దర్శిస్తుంటారు. ఉగాది రోజు కుటుంబ సభ్యులు అందరు కలిసి పచ్చడి సేవిస్తుంటారు.
సంవత్సరంలో ఏర్పడే శుభ అశుభాల గురించి తెలుసుకుంటారు. శిశిర రుతువు పోయి వసంత రువుతు ఆగమనంలో ఉగాదిని జరుపుకుంటాం. వసంత మాసంలో చెట్లు చిగురిస్తాయి. ఉగాది రోజు గుమ్మానికి మామిడి ఆకులు కట్టుకుంటాం. వాకిల్లో రంగురంగుల ముగ్గులు వేస్తుంటారు. రంగవల్లులు చల్లుకుని దేవుడిని కొలుస్తుంటారు. జీవితంలో ఈ ఏడాది మంచి ఫలితాలు కలగాలని వేడుకుంటారు. ఉల్లాసంగా సంవత్సరం గడవాలని ఆశిస్తారు. ఇలా ఉగాది విశిష్టతను మననం చేసుకుంటాం.
ఉగాది రోజు గుమ్మానికి ఏం కట్టుకోవాలి? ఏది కట్టుకుంటే మంచి జరుగుతుంది? సాధారణంగా గుమ్మానికి మామిడి ఆకులు కట్టుకుంటారు. మామిడి ఆకులు కట్టడంతో గుమ్మానికి కళ వస్తుంది. కానీ ఉగాది రోజు గుమ్మానికి మామిడి ఆకులే కాకుండా మంచి జరగాలంటే ఓ పరిహారం చేయాలి. ఉగాది ముందు రోజు వచ్చే అమావాస్య నాడు బూడిద గుమ్మడి కాయ కట్టుకుంటే మంచి ఫలితం వస్తుంది. నెగెటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ సొంతమవుతుంది. ఈ పరిహారం పాటిస్తే మంచిది.

గుమ్మడికాయను సాధారణ రోజుల్లో కూడా కట్టుకుంటాం. కానీ ఈ రోజు కట్టుకుంటే ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఈ పరిహారం పాటిస్తే మనకు ఎదురుండదు. దిష్టి తీయని గుమ్మడికాయను కట్టకూడదు. ఉగాది రోజు సూర్యోదయానికి ముందే దీన్ని కట్టుకోవాలి. దీంతో అన్నింట్లో మనకు విజయాలు కలుగుతాయి. గుమ్మడికాయ విశిష్టత తెలుసుకుని గుమ్మానికి కట్టుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని గుర్తుంచుకుని అందరు గుమ్మానికి గుమ్మడికాయ కట్టుకునేందుకు ప్రాధాన్యం ఇస్తే సరి.