https://oktelugu.com/

Allu Arjun: నేనేందుకు పనికిరానని రూ.10 లక్షలు డిపాజిట్ చేశాడు.. తాతపై అల్లు అర్జున్ హాట్ కామెంట్స్

Allu Arjun: అలనాటి సినిమాల్లో ప్రముఖ హస్య నటుడు ఎవరంటే ఠక్కున గుర్తుకొచ్చే పేరు అల్లు రామలింగయ్య. సీనియర్ ఎన్టీఆర్ లాంటి మహా నటులతో కలిసి నటించిన ఆయన చేసిన కామెడీ ఇప్పటికీ నవ్వులు పూయిస్తాయి. అల్లు రామలింగయ్య వారసులుగా ఇప్పుడు ఎంతో మంది ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఆయన పేరు నిలబెడుతున్నారు. ఈ శనివారం ఆయన శత జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు, ప్రముఖ నిర్మాత అల్లు రామలింగయ్యతో పాటు మెగాస్టార్ […]

Written By: , Updated On : October 2, 2022 / 01:46 PM IST
Follow us on

Allu Arjun: అలనాటి సినిమాల్లో ప్రముఖ హస్య నటుడు ఎవరంటే ఠక్కున గుర్తుకొచ్చే పేరు అల్లు రామలింగయ్య. సీనియర్ ఎన్టీఆర్ లాంటి మహా నటులతో కలిసి నటించిన ఆయన చేసిన కామెడీ ఇప్పటికీ నవ్వులు పూయిస్తాయి. అల్లు రామలింగయ్య వారసులుగా ఇప్పుడు ఎంతో మంది ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఆయన పేరు నిలబెడుతున్నారు. ఈ శనివారం ఆయన శత జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు, ప్రముఖ నిర్మాత అల్లు రామలింగయ్యతో పాటు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చను లేపాయి.

అల్లు రామలింగయ్య మనువడైన అల్లు అర్జున్ గురించి నేటి సినీ ప్రేక్షకుల్లో తెలియనివారుండరు. గంగోత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన వరుస హిట్లతో దూసుకెళ్లారు. ‘ఆర్య’ సినిమాతో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న బన్నీ ఆ తరువాత రేసుగుర్రం, సరైనోడు సినిమాలతో మాస్ హీరో అనిపించుకున్నారు. జులాయి సినిమాతో కామెడీ చేయనని నిరూపించారు. ఇక ఆయన తీసిన పష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా బన్నీకి కేరళలో అశేష అభిమానులు ఉండడం విశేషం.

ఇక తాత శత జయంతి సందర్భంగా బన్నీ తన చిన్ననాటి సంగతులు గుర్తు చేసుకున్నారు. తాను 16 ఏళ్లు వచ్చే వరకు తాత, నానమ్మల దగ్గరే పెరిగానని తెలిపాడు. అయితే తన ప్రవర్తను గమనించిన తాత తనకు నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడే బన్నీ పేరిట కొంత అమౌంట్ ఫిక్స్ డ్ డిపాజిట్ చేశారట. అవి అల్లు రామలింగయ్య చనిపోయిన తరువాత బన్నీకే చెందాలని వీలునామా రాశాడట. ఇంతకీ అసలు విషయమేంటటే తన ప్రవర్తన చిన్నప్పుడు సరిగా లేదని, ఎందుకు పనికిరాడని అన్నారట. ఇందులో భాగంగా ఈ డబ్బులు ఫ్యూచర్లో దేనికైనా పనికొస్తాయని బన్నీ పేరిట ఫిక్స్ చేశారు. ఈ సందర్భంగా బన్నీ తన తాత గురించి చెప్పాడు.

ఆరోజు మాతాత దృష్టిలో నేను పనికిరానివాడిని. కానీ ఇప్పుడు పెద్ద స్టార్ అయ్యాను. కానీ నా గుర్తింపును చూడ్డానికి తాత లేడు. ఆయన ఉంటే బాగుండేది.. అని బన్నీ కన్నీళ్లతో చెప్పాడు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ‘మనవూరి పాండవులు’ సినిమాలో అల్లు రామలింగయ్య గారిని కలిశానన్నారు. ఆ సమయంలో ప్రత్యేకంగా నామీద దృష్టిపెడుతుండగా అర్థం కాలేదని, ఆ తరువాత సురేఖను ఇచ్చి పెళ్లి చేయడానికే అని తరువాత తెలుసుకున్నానని అన్నారు. మా ఇద్దరి పెళ్లి చాలా విచిత్రంగా జరిగిందని అన్నారు. సినిమాల షూటింగ్ బిజీగా ఉన్న సమయంలో మూడురోజుల్లోనే పెళ్లి తంతు ముగిసిందని తెలిపారు.

Icon Star Allu Arjun Superb Speech @ Allu Ramalingaiah Book Launch | Manastars