
Ravi Teja: పరిశ్రమలో సెల్ఫ్ మేడ్ స్టార్స్ అరుదుగా ఉంటారు. వారిలో హీరో రవితేజ ఒకడు. మూడు దశాబ్దాలుగా ఆయన టాలీవుడ్ లో కొనసాగుతున్నారు. సెట్ లో లైట్ బాయ్ నుండి అన్ని పనులు చేశాడు. అసిస్టెంట్ డైరెక్టర్ , విలన్ , సపోర్టింగ్ యాక్టర్… ఇలా వచ్చిన ప్రతి అవకాశం వదలకుండా చేశాడు. ఎన్నో కష్టాలు, ఇబ్బందులు పడుతూ హీరో అయ్యారు. వరుస హిట్స్ తో స్టార్ గా ఎదిగారు. టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరిగా అవతరించిన రవితేజకు ఒకప్పటి తన కష్టాలు చెప్పుకోవడం ఇష్టం ఉండదట. అది చాలా సిల్లీ అంటూ ఆయన కొట్టిపారేశారు.
రవితేజ లేటెస్ట్ మూవీ రావణాసుర. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. రవితేజ, సుశాంత్ లను దర్శకుడు హరీష్ శంకర్ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఈ సందర్భంగా హరీష్… ఆటోగ్రాఫ్ మూవీ షూటింగ్ సంగతులు గుర్తు చేసుకున్నారు. ఆ సినిమా ప్యాచ్ వర్క్ కోసం రవితేజ మీద జూబ్లీ చెక్ పోస్ట్ ఏరియాలో సోలో బైక్ షాట్స్ తీశాం. తర్వాత అందరం ప్రసాద్ ల్యాబ్స్ లో కలిశాము. షూట్ అయిపోయిన తర్వాత రవితేజ ఒక్కడే బైక్ మీద అక్కడకు వచ్చారు. పక్కన బౌన్సర్లు కూడా లేరు.
ఏంటన్నయ్యా… బైక్ మీద వచ్చేశావ్ అని నేను అడిగాను. దానికి ఆయన అవకాశాల కోసం ఇదే రోడ్డు మీద యమహా బైక్ వేసుకుని ఎన్నిసార్లు తిరిగానో. డబ్బులు కూడా ఉండేవి కావు. లీటర్ పెట్రోలు కొట్టించుకుని దాన్ని జాగ్రత్తగా వాడుకుంటూ తిరిగే వాడిని . స్లోప్ వచ్చినప్పుడు ఇంజిన్ ఆపేసేవాడినని చెప్పాడని హరీష్ అన్నారు. ఇప్పుడు స్టార్ గా ఎదిగాక ఇదే రోడ్డు మీద బైక్ మీద వస్తుంటే మీకు ఏమనిపిస్తుందని రవితేజను హరీష్ అడిగారు. ప్రసాద్ లాబ్స్ దగ్గర బైక్ ఇంజిన్ ఆపేస్తే పంజా గుట్ట వరకు బైక్ వెళ్లిపోయేది. అయితే నేను ఏదీ సీరియస్ గా తీసుకోను.
ఒకప్పటి నా కష్టాలు చెప్పాలంటే ఇప్పుడు కామెడీ. అసలు చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది. అప్పట్లో వాడు అలా చేశాడు. వీడు అవమానించాడు వంటి సిల్లీ థింగ్స్ కూడా గుర్తు పెట్టుకొని రివేంజ్ తీర్చుకోవడం అన్నీ వేస్టు. అయినా నేను కష్టపడ్డాను అంటే ఎవరి కోసం కష్టపడ్డాను. నా కోసం నేను కష్టపడ్డాను. నువ్వు కష్టపడుతుంది నీకోసం. దాన్ని గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదని రవితేజ అన్నారు.

పక్కనే ఉన్న సుశాంత్… ఈయనతో నటిస్తూ నేను జీవితం గురించి తెలుసుకున్నాను. ఆయన గురించి ఎవరైనా చెప్పడమే కానీ తనకు తాను ఏనాడూ చెప్పుకోలేదని అన్నారు. కాగా రావణాసురు మూవీలో సుశాంత్ కీలక రోల్ చేస్తున్నారు. ఏప్రిల్ 7న సమ్మర్ కానుకగా రావణాసుర విడుదల కానుంది. రవితేజ క్రిమినల్ లాయర్ రోల్ చేస్తుండగా ట్రైలర్ ఆకట్టుకుంది. సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు.