Dil Raju : RRR మూవీ చేస్తున్న సమయంలో రామ్ చరణ్ కి ఇండియా లో ఉన్న టాప్ మోస్ట్ డైరెక్టర్స్ ఎంతోమంది ఆయనతో సినిమాలు చేయడానికి అగ్రీమెంట్స్ చేసుకున్నారు. ప్రశాంత్ నీల్, లోకేష్ కనకరాజ్, సుకుమార్ ఇలా ఎంతో మంది ఆ లిస్ట్ లో ఉన్నారు. కానీ వీళ్ళెవ్వరితో కాకుండా ముందుగా ఆయన శంకర్ దర్శకత్వం లో నటించడానికే ఎక్కువ మొగ్గు చూపించాడు. నిర్మాత దిల్ రాజు కి సినిమా షూటింగ్ పూర్తి అయ్యే వరకు మరో సినిమాకి షిఫ్ట్ అవ్వను అని ఒప్పందం కూడా చేసుకున్నాడు. ఇచ్చిన మాట ప్రకారం ‘గేమ్ చేంజర్’ చిత్రం కోసం మూడేళ్ళ అమూల్యమైన సమయాన్ని కేటాయించాడు. మధ్యలో ఆయనకి జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తో ఒక సినిమా ప్రారంభించాల్సి ఉంది. దానిని కూడా ఆయన ‘గేమ్ చేంజర్’ చిత్రం కోసం వదిలేసాడు. ఇన్ని చేసి కూడా ఫలితం లేకుండా పోయింది.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బోల్తా కొట్టింది. నెగటివ్ టాక్ అయితే కనీవినీ ఎరుగని రీతిలో వచ్చింది. ట్రోల్స్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇంత నెగటివ్ టాక్ మధ్యలో ఈ సినిమాకి సంబంధించిన HD వెర్షన్ ని పైరసీ చేసి సోషల్ మీడియా వదిలేసారు. అంతే కాదు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లోనూ, అనేక లోకల్ టీవీ చానెల్స్ లోనూ టెలికాస్ట్ చేసారు. ఇవన్నీ పక్కన పెడితే ఎంత పెద్ద ఫ్లాప్ సినిమాకి అయినా కనీస స్థాయిలో ప్రొమోషన్స్, సక్సెస్ మీట్స్ పెట్టడం వంటివి ఇది వరకు మనం ఎన్నో చూసాము. కానీ ‘గేమ్ చేంజర్’ విడుదల తర్వాత కనీసం మాటవరుసకి అయినా దిల్ రాజు ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేయలేదు. అలా గాలికి వదిలేశాడు. 14వ తేదీ ఆయన నిర్మాణ సంస్థ నుండి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే చిత్రం విడుదలై సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది. వసూళ్లు మామూలు రేంజ్ లో లేవు.
‘గేమ్ చేంజర్’ మిగిల్చిన నష్టాల నుండి ఈ సినిమా దిల్ రాజు ని బయటపడేసింది. దీంతో ఆయన ఆనందానికి హద్దులే లేకుండా పోయింది. సంబరాలు చేసుకుంటున్నాడు. ఆయన ముఖం లో ఒక నూతనోత్సాహం నెలకొంది. సక్సెస్ మీట్స్ నాన్ స్టాప్ గా పెట్టేస్తున్నాడు. కానీ ‘గేమ్ చేంజర్’ ని మాత్రం అలా పక్కన పడేశాడు. నిర్మాత నష్టపోకూడదని, హీరో ఎప్పుడు అడిగితే అప్పుడు డేట్స్ ఇచ్చాడు. కావాల్సినంత ప్రొమోషన్స్ కూడా చేసి పెట్టాడు. ఆయన ఇచ్చిన మూడేళ్ళ విలువైన సమయానికి ఇసుమంత గౌరవం కూడా దిల్ రాజు కి ఇవ్వాలని అనిపించలేదా?, ఇలా ఆయన పాటికి ఆయన వేరే సినిమా సక్సెస్ సెలెబ్రేషన్స్ లో ఉంటే పాపం హీరో ఏమి అనుకుంటాడో అనే భావన కూడా ఇతనిలో లేదా?, ఇంత నిర్లక్ష్యం ఏమిటి?, ఒక్క ఫెయిల్యూర్ వస్తే హీరో పడిన కష్టానికి కనీస స్థాయిలో కూడా విలువని ఇవ్వరా? అంటూ సోషల్ మీడియా లో రామ్ చరణ్ అభిమానులు బాధపడుతున్నారు