
Hyper Aadi- Varsha: జబర్దస్త్ మెల్లగా కళ కోల్పోతుండగా మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ శ్రీదేవి డ్రామా కంపెనీ మీద ఫోకస్ పెడుతుంది. అన్ని రకాల ఎంటర్టైన్మెంట్స్ తో కూడిన శ్రీదేవి డ్రామా కంపెనీ బాగానే ఆదరణ దక్కించుకుంటుంది. ఈ షో బిగినింగ్ లో సుడిగాలి సుధీర్ యాంకర్ గా వ్యవహరించారు. ఆయన మల్లెమాలకు దూరమయ్యాక… హైపర్ ఆది లైన్లోకి వచ్చాడు. హైపర్ ఆది, రష్మీ గౌతమ్ నేతృత్వంలో శ్రీదేవి డ్రామా కంపెనీ విజయపథంలో దూసుకెళుతుంది. తాజా ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ఆసక్తి రేపుతోంది.
ఈ ఎపిసోడ్లో హైపర్ ఆది శోభనం కాన్సెప్ట్ తీసుకొని షో చేశారు. ఆర్కెస్ట్రా కళాకారులను పిలిపించి సాంగ్స్ పాడించారు. ఒక స్కిట్లో జబర్దస్త్ వర్ష చేశారు. నన్ను పెట్టి ఒక ప్రొడ్యూసర్ వంద కోట్లతో సినిమా తీస్తా అన్నాడు… అని వర్ష డైలాగ్ చెప్పింది. వర్ష డైలాగ్ కి హైపర్ ఆది కౌంటర్ ఇచ్చాడు. నీ మొహానికి మేనేజర్ పదివేలు కూడా ఇవ్వడు. అలాంటిది వంద కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారా… అన్నాడు. మళ్ళీ వర్ష… ఆ పిల్ల జమిందార్ నా బొమ్మకు కోటి పెడతా అన్నాడు, అని చెప్పింది. కోటి పెట్టి బొమ్మా…, ఏది ఈ కోతి బొమ్మకు… అని మళ్ళీ కౌంటర్ వేశాడు.
వర్ష మీద ఆది పంచులు నవ్వులు తెప్పించాయి. అయితే ఎపిసోడ్ చివర్లో ఒక ఎమోషనల్ సీన్ ట్రై చేశారు. ఒకవేళ ఇమ్మానియేల్ మరణిస్తే వర్ష ఎలా రియాక్ట్ అవుతుందో చేసి చూపాలని యాంకర్ రష్మీ కోరింది. వేదిక మీద ఇమ్మానియేల్ శవంలా పడుకున్నాడు. వర్ష పరుగున వచ్చి పెద్దగా ఏడ్చేసింది. ఎవరైనా ఉన్నారా కాపాడండి అంటూ కేకలు వేసింది. వర్ష సహజ నటన షోలో ఉన్నవారి గుండెలు బరువెక్కేలా చేసింది. శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ ఎపిసోడ్ అన్ని రకాల హంగులతో సంపూర్ణంగా సిద్ధమైంది.

ఇక ఒకప్పటి సీరియల్ నటి వర్ష దూసుకుపోతుంది. బుల్లితెర స్టార్ గా ఆమె కొంత ఫేమ్ తెచ్చుకున్నారు. వర్ష జబర్దస్త్ కి ఎంట్రీ ఇవ్వడం ఆమెకు కలిసొచ్చింది. జబర్దస్త్ షోలో లేడీ కమెడియన్ గా ఆమె సెటిల్ అయ్యారు. తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్నారు. చెప్పాలంటే ఇమ్మానియేల్ తో లవ్ ట్రాక్ ఆమెకు బాగా కలిసొచ్చింది. బుల్లితెర ప్రేమికులుగా ప్రచారమైన ఇమ్మానియేల్-వర్ష తమ కెరీర్స్ సెట్ చేసుకున్నారు.