https://oktelugu.com/

Hyper Adi – Janasean : జనసేన పార్టీ కోసం హైపర్ ఆది భారీ విరాళం.. ఎంత ఇచ్చాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు

Hyper Adi – Janasean : సినీ రంగంలో ఉన్నప్పుడు ఒక రాజకీయ పార్టీ కి సపోర్టు గా నిలబడడం అంటే సాధారణమైన విషయం కాదు..చాలా గట్స్ ఉండాలి, ఆ విషయం లో హైపర్ ఆదిని ఎంత మెచ్చుకున్నా అది తక్కువే అవుతుంది.నమ్మిన నాయకుడు కోసం పవర్ లో ఉన్న వైసీపీ పార్టీ మీద విమర్శలు చెయ్యడానికి ఏమాత్రం కూడా వెనకాడలేదు.శ్రీకాకుళం లో జనసేన పార్టీ తరుపున నిర్వహించిన ‘యువ శక్తి’ కార్యక్రమం లో హైపర్ ఆది […]

Written By:
  • NARESH
  • , Updated On : February 4, 2023 / 09:44 PM IST
    Follow us on

    Hyper Adi – Janasean : సినీ రంగంలో ఉన్నప్పుడు ఒక రాజకీయ పార్టీ కి సపోర్టు గా నిలబడడం అంటే సాధారణమైన విషయం కాదు..చాలా గట్స్ ఉండాలి, ఆ విషయం లో హైపర్ ఆదిని ఎంత మెచ్చుకున్నా అది తక్కువే అవుతుంది.నమ్మిన నాయకుడు కోసం పవర్ లో ఉన్న వైసీపీ పార్టీ మీద విమర్శలు చెయ్యడానికి ఏమాత్రం కూడా వెనకాడలేదు.శ్రీకాకుళం లో జనసేన పార్టీ తరుపున నిర్వహించిన ‘యువ శక్తి’ కార్యక్రమం లో హైపర్ ఆది ఇచ్చిన ప్రసంగం ని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు.

    ప్రస్తుతం ఆయన పవన్ కళ్యాణ్ తో ‘హరి హర వీరమల్లు’ అనే చిత్రంలో నటిస్తున్నాడు, ఈ సినిమా షూటింగ్ సమయం లోనే హైపర్ ఆది కళ్యాణ్ కి బాగా దగ్గరయ్యాడు అట, అంతే కాదు హైపర్ ఆది టాలెంట్ ని గుర్తించి ఈ చిత్రంలో కొన్ని కీలక సన్నివేశాలకు గాను పవన్ కళ్యాణ్ అతని చేత డైలాగ్స్ కూడా రాయించాడట.

    పవన్ కళ్యాణ్ ని మొదటి నుండి ఎంతగానో ఆరాధించే స్వభావం ఉన్న హైపర్ ఆదికి, ఈ సినిమాలో నటిస్తూ పవన్ కళ్యాణ్ ని దగ్గరగా రోజు చూస్తూ ఆయన నుండి ఎన్నో కొత్త విషయాలను నేర్చుకుంటూ పరమ భక్తుడిలాగా మారిపొయ్యాడట. ఆరోజు లక్షలాది మంది అభిమానుల మధ్య హైపర్ ఆది ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంత ధైర్యంగా మాట్లాడడానికి కారణం కూడా అదే అంటున్నారు విశ్లేషకులు.. ఇది ఇలా ఉండగా హైపర్ ఆది జనసేన పార్టీ కి భారీగా విరాళం ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది, బుల్లితెర మీద పాపులర్ కమెడియన్ గా ఎవ్వరు అందుకోలేని రేంజ్ కి ఎదిగిన హైపర్ ఆది కి ఈమధ్య సినిమాల్లో కూడా అవకాశాలు వెల్లువలాగా కురుస్తున్నాయి.

    దాంతో ఆయన రెమ్యూనరేషన్ కూడా భారీ రేంజ్ లోనే పెంచేసినట్టు సమాచారం.అలా ఎంటర్టైన్మెంట్ షోస్ మరియు సినిమాల్లో నటిస్తూ బాగా సంపాదించిన హైపర్ ఆది జనసేన పార్టీ కి 50 లక్షల రూపాయిలు వరకు విరాళం ఇవ్వబోతున్నట్టు సమాచారం..దీని గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.