Hyderabad Crime News: సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. పెరుగుతున్న టెక్నాలజీని సరిగి వినియోగించుకుంటే ఎలాంటి నష్టం జరగదని ఈ ఘటన చూస్తే అర్థమవుతోంది. ఇంటికి తాళం వేసి అమెరికా వెళ్లిన ఓ కుటుంబం సీసీ పుటేజీ ఆధారంగా తన ఇంట్లో జరుగుతున్న దొంగతనాన్ని కనిపెట్టి చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేసి సొత్తు, నగదు అపహరణకు గురికాకుండా అడ్డుకున్న వైనం చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న సైన్స్ ను తమకు అనుకూలంా మలుచుకుంటున్నారు. దీంతో నష్ట నివారణ సాధ్యమైంది.

వివరాల్లోకి వెళితే హైదరాబాద్ కేపీహెచ్ బీ రెండో రోడ్డులోని ఎల్ ఐజీ 237 ప్లాట్ యజమాని ఇంటికి తాళం వేసి అమెరికాకు వెళ్లారు. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారు జామున మూడు గంటలకు తన ఇంట్లోని సీసీ టీవీ పుటేజీ ఆధారంగా ఎవరో దూరినట్లు గుర్తించారు. తరువాత చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేశారు. దీంతో వారు ఇంటికి చేరుకుని పరిశీలించగా తాళం పగులగొట్టి ఇంటి లోపల నుంచి తాళం వేసినట్లు గుర్తించారు.
Also Read: తర్వాత టార్గెట్ ఆ రెండు రాష్ట్రలే.. మోడీ వ్యూహం మొదలెట్టేశారు
తక్షణమే పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో వారు వచ్చి దొంగను అదుపులోకి తీసుకున్నారు. అపహరించిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. దీంతో దొంగ దాచి ఉంచిన నగదు, వెండి ఆభరణాలు గుర్తించి బయటకు తీశారు. దొంగ సోఫా కింద, మంచం పరుపు కింద దాయడంతో వాటిని గుర్తించారు. చోరీకి పాల్పడిన దొం నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం యాపర్లకు చెందిన తిప్పరాజు రామకృష్ణగా గుర్తించారు.
ఇదివరకు అతడు పదిసార్లు జైలుకు వెళ్లి వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల జైలు నుంచి విడుదలై మళ్లీ దొంగతనానికి పాల్పడటం తెలిసిందే. గతంలో దొంగతనం జరిగితే ఎవరికి తెలిసేది కాదు. పెరుగుతున్న సాంకేతికతతో సీసీ పుటేజీ ఆధారంగా దొంగను గుర్తించి పోలీసులకు అప్పగించడంపై అందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దొంగను గుర్తించినందుకు పోలీసులు సైతం ఇంటి యజమానిని ప్రశంసించారు.

ఇంతకుముందు దొంగతనం చేసిన తరువాత పోలీసులు వచ్చి ఆరా తీసి ఎన్నో రోజులు దర్యాప్తు చేసి దొంగ దొరికితే సొత్తును స్వాధీనం చేయడం లేదంటే కేసు మూసివేసేవారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఎక్కడున్నా మన ఇంట్లో ఏం జరుగుతుందోనని తెలుసుకోవడం గొప్ప విషయం. సమయానికి అప్రమత్తమై దొంగను గుర్తించి పట్టుకోవడానికి సాయపడిన ఇంటి యజమాని తీరును అందరు పొగిడారు.
Also Read: ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. ఆ కార్డుతో రూ.5 లక్షల భీమా?