Ram Gopal Varma Interesting Tweet: రామ్ గోపాల్ వర్మకు వివాదానికి విడదీయరాని సంబంధం ఉంది. వివాదం వర్మ నీడగా ఉంటుంది. అసలు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా ఓ ఫొటో షేర్ చేశాడు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన పెంపుడు కుక్కతో ‘నాకు ఫీలింగ్స్ ఉంటాయని’ ఓ ఫొటోను షేర్ చేశాడు. వర్మకు జంతువులంటే ఎంతో ఇష్టమని దాని ద్వారా తెలుస్తోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు.

కొంపతీసి తాగిన మత్తులో ఫొటో దిగావా అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే, వర్మ తన స్వార్ధం కోసం ఇతరుల జీవితాలలో పేకాడుకుంటారు. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై సినిమాలు తీసి పబ్బడం గడుపుకుంటారు. తన స్వలాభం కోసం మానం, అభిమానంపై కూడా సినిమాలు తీసి క్యాష్ చేసుకుంటాడు. పైగా తనకు ఫీలింగ్స్ లేవని, నా సుఖం నాదే. నా స్వార్ధం నాదే అంటాడు.
Also Read: ‘ఆర్ఆర్ఆర్’ ‘ఎత్తర జెండా’ అదిరిపోతోందట
‘తల్లీ చెల్లీ ఏ గల్లీలో లేని సిల్లీ నా కొడుకుని’ అంటూ వర్మ చెప్పుకుంటూ వంద శాతం వర్తిస్తుంది. అన్నట్టు వర్మ ఎన్ని విమర్శల పాలు అవుతున్నా తన చెత్త సినిమాల పరంపరను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు. మరో సినిమాకి వర్మ రెడీ అవుతున్నాడు. ఈ సినిమా కూడా వైజాగ్ కి చెందిన ఒక రాజకీయ నాయకుడి పై ఉంటుందట. అసలు వర్మ ఈ మధ్య కంటెంట్ ను నమ్ముకొని సినిమా తీయలేదు, కేవలం వివాదాన్ని, ప్రచారాన్ని నమ్ముకొని మాత్రమే సినిమాలు తీసుకుంటూ పోతున్నాడు. ఇంకా తీస్తున్నాడు.

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు తెలిపోతూ ఏవో పిచ్చి పిచ్చి సినిమాలు చేస్తున్నాడు గానీ, ఒకప్పుడు “శివ, కంపెనీ, క్షణక్షణం, సత్య, సర్కార్ లాంటి సినిమాలతో భారతీయ సినీచరిత్రలోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఘనత వర్మది
Also Read: రాధేశ్యామ్ థియేటర్ దగ్గర ప్రమాదం.. సినిమా పై రాజమౌళి, గోపీచంద్ రియాక్షన్స్
[…] Shruti Haasan: శ్రుతి హాసన్ ఫుల్ జోష్ లో ఉంది. చేతి నిండా సినిమాలే. వ్యక్తిగత ప్రేమకు ఫుల్ స్టాప్ చెప్పి.. ప్రస్తుతం కెరీర్ పై ఫోకస్ పెట్టింది. బాలయ్య సినిమాలో హీరోయిన్ గా ఆమెను ఫైనల్ చేసిన దగ్గర నుంచి శ్రుతి హాసన్ కు చాన్స్ లు పెరిగాయి. పైగా బాలీవుడ్, హాలీవుడ్ లోనూ పాగా వేసేందుకు శ్రుతి హాసన్ బాగా ఉత్సాహంగా ఉంది. వరుస సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ.. పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకుంటుంది. […]