Husband And Wife Relationship: భార్య, భర్తల బంధం అన్యోన్యమైనది. పెళ్లి జరిగినప్పుడే వీరు కలకాలం కలిసుండాలని కోరుకుంటారు. అయితే చాలా మంది చిన్న చిన్న కారణాలతోనే గొడవలు పెట్టుకుంటారు. ఈ గొడవలను విడాకుల వరకు తీసుకెళ్తారు. కొంత మంది దంపతుల మధ్య ఎన్ని గొడవలు ఉన్నా.. క్షణంలో కలిసిపోతుంటారు. వీరు జీవితాంతం కలిసుంటారనే అర్థం. సాధారణంగా భార్యపై, భర్తకు… భర్తపై భార్యకు ప్రేమ ఉంటుంది. కానీ వారిది ప్రేమ అని ఎవరూ ఒప్పుకోరు. కొన్ని సందర్భాల్లో బయటపెడుతూ ఉంటారు. ఈ క్రమంలో వారి మధ్య జరిగే సంభాషణలు నవ్వులు పూయిస్తుంటాయి. ఒక భార్య పుట్టింటికి వెళ్తూ భర్తకు కొన్ని కండీషన్లు పెడుతుంది. వీటిలో కొన్ని మరిచిపోయినా వాట్సాప్ ద్వారా మెసేజ్ పెడుతుంది. ఈ మెసేజ్ లు ఏ రకంగా ఉంటాయంటే..
భార్య పుట్టింటికి వెళితే భర్త ఎంతో సంతోషంగా ఉంటాడని కొన్ని సినిమాల్లో చూస్తుంటాం. అప్పటి వరకు ఉన్న పరిమితులు తగ్గిపోతాయి. స్వేచ్ఛా వాతావరణం జీవిస్తామని కొందరు భావిస్తుంటారు. అందుకే ‘పెళ్లా ఊరెళితే’ అనే ఓ సినిమాను కూడా తీసిన విషయం తెలిసిందే. అయితే భార్యపుట్టింటికి వెళ్లినప్పుడు సవాలక్ష నిబంధనలు విధిస్తుంది. వీటిలో ఏ ఒక్కటి పాటించకపోయినా రొట్ల కడాయి తిప్పేస్తుంది. ఆ రూల్స్ ఏంటో చూద్దాం..
నేటి నుంచి పనిమనిషి రాదు.. వాళ్ల అమ్మ వస్తుంది.. నేనూ వచ్చేదాకా.. ఈమెనే పనిచేస్తుంది.., ఇంట్లో పార్టీలు చేసుకోవద్దు.. ఎందుకంటే నేను వచ్చాక ఇల్లు శుభ్రం చేయడం కష్టమవుతుంది.., కళ్లజోడు బాత్రూంలో మరిచిపోవడం మీకు అలవాటు.. అలా పదే పదే చేయకండి.. తెచ్చివ్వడానికి ఎవరూ ఉండరు.., అద్దం ముందు ఎక్కువ సేపు నిలబడకండి.. మీరు అలా చేస్తారనే టైం ఫాస్ట్ గా పెట్టాను.., ఇంటర్నెట్ రావట్లేదని కంప్లయింట్ చేయకండి.. ఎందుకంటే నేనే కట్ చేయించాను.. నేను వచ్చేదాక ఇంటర్నెట్ రాదు..
ఇక ఇటీవల ఓ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ భార్య తన భర్తకు ‘పోయినసారిలాగా స్టవ్ వెలగలేదని నాకు ఫోన్ చేయకుండి.. ముందుగా స్టవ్ ఆన్ చేయండి..అప్పటికీ వెలగపోతే ఫోన్ చేయండి..’ అని మెసేజ్ పెట్టింది. అంతే భార్య ఇంట్లో లేకపోవడంతో ఎంత ఆనందంగా ఫీలవుతారో.. అన్నే కష్టాలు ఎదుర్కొంటారనేది వాస్తవం అని ఈ మెసేజ్ ను బట్టి అర్థమవుతోంది.