Husband And Wife Relationship: అదో పెద్ద ఐటీ కంపెనీ. ఏదో ప్రాజెక్టు మీద బాస్ తన కింద పనిచేసే ఉద్యోగులతో మాట్లాడుతున్నారు. అప్పటికే గంటలు గడిచాయి. ప్రతీ ఉద్యోగి ముఖంలో నీరసం తాలూకూ చాయలు కనిపిస్తున్నాయి. అది ఆ బాస్ కు అర్థమైంది. వాతావరణాన్ని తేలికపరచాలి అనుకున్నాడు. ” మిత్రులారా! భార్యలు గంటలు గంటలు షాపింగ్ ఎందుకు చేస్తారో మీకు తెలుసా?” అని అడిగాడు. దానికి అందరూ తెలియదు అన్నట్టుగా ముఖాలు పెట్టారు.” నేను కూడా ఈ మధ్య నా నా భార్యను ఇదే ప్రశ్న అడిగాను. దానికి ఆమె ఏం చెప్పిందంటే.. పెళ్లి చూపుల్లో మీరు నాకు నచ్చలేదు. ఐటి కంపెనీలో మంచి ఉద్యోగం వెంటనే చేసుకోమని నాపై మా వాళ్ళు ఒత్తిడి చేశారు. నేను కూడా వాళ్ళ మాటకే తలోగ్గాను. జీవితంలో నచ్చిన వాడిని ఎలాగూ కట్టుకోలేదు. కనీసం కట్టుకునేవన్నా బాగుండాలని, నచ్చే వాటికోసం గంటలు గంటలు పరిశీలించి చూస్తా అని బదులిచ్చింది” అని చెప్పాడు. దీంతో అప్పటిదాకా నీరసంగా ఉన్న ఉద్యోగులు పగలబడి నవ్వారు. తర్వాత ఆ సమావేశం మరికొన్ని గంటలపాటు సాగింది. ఇలా ఈ ఐటి బాస్ మాత్రమే కాదు.. మధ్య తరగతి బడ్జెట్ పద్మనాభం, పేదరికంలో కొట్టుమిట్టాడే పుల్లయ్య.. అందరికీ ఇలాంటి అనుభవాలు కోకొల్లలు. ఆ మధ్య పెళ్ళైన ఓ నవ వరుడు భార్యను చెప్పు చేతుల్లో ఉంచుకుంటానని స్నేహితుల వద్ద శపధం చేశాడు. ప్రతి దానికి గూగుల్ మీద ఆధారపడే అతడు.. హౌ టు కంట్రోల్ మై వైఫ్ అని టైప్ చేసాడు. ప్లేమబుల్ థింగ్స్ ఇన్ యువర్ హోం. హ్యాండిల్ విత్ కేర్ అని గూగుల్ చెప్పింది. ఈ సమాధానంతో ఆ యువకుడికి దిమ్మతిరిగిపోయింది. తర్వాత భార్య వల్ల ఎదురైన అనుభవాలతో ఇంకెప్పుడూ స్నేహితుల వద్ద శపధం చేయలేదు. ఆ మాటకు వస్తే అంత పిచ్చాపాటిగా మాట్లాడే అవకాశం కూడా అతడికి దక్కలేదు. బహుశా ఇక ముందు దక్కుతుందో లేదో కూడా తెలియదు.

– శ్రీకృష్ణుడు మనుషులకే దేవుడు.. ఆమెకు మాత్రం
భార్యామణి కోపంగా ఉంటే భర్తలు బుజ్జగిస్తారు. ఇది 100% కుటుంబాల్లో ఉండేదే. బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న రోజుల్లో సతీసమేతంగా ఓ కార్యక్రమానికి హాజరు కావాల్సి వచ్చింది. ఒబామా సతీమణి ఆయనకు ఎడమ వైపు కూర్చుంది. ఆయనకు కుడివైపు కొంతమంది మహిళలు కూర్చున్నారు. అసలే అమెరికా అధ్యక్షుడు.. పైగా తమ పక్కనే కూర్చున్నాడు. దీంతో ఆ మహిళలు ఆయనతో మాట కలిపారు. ఆయన కూడా వారితో సరదాగా సంభాషించారు. ఈ తతంగాన్ని ఒబామా సతీమణి ఓ కంట కనిపెడుతూనే ఉంది. ఒబామా వైపు సీరియస్ గా చూసింది. అప్పటికే సర్దుకున్న ఆయన.. వారితో మాటలను ఆపేశాడు. కార్యక్రమం ముగిసిన అనంతరం ఒబామా దంపతులు వైట్ హౌస్ లోని తమ అధికారిక నివాసంలోకి వెళ్లారు. ఇక అప్పటినుంచి ఆయన భార్య క్లాస్ పీకడం మొదలుపెట్టింది. అది ఎంతకు దారి తీసింది అంటే.. మరే ఇతర సమావేశాల్లో బరాక్ ఒబామా పక్కన స్త్రీలు కూర్చోలేనంతగా.. ఈ విషయాన్ని ఒబామా అధ్యక్ష పదవి ముగిసిన తర్వాత సన్మాన కార్యక్రమంలో చెప్పుకుని పగలబడి నవ్వాడు. ‘నేను ఇతర స్త్రీతో మాట్లాడడాన్ని కూడా నా సతీమణి సహించలేదు. నాకు మొదట్లో ఇది అవమానంగా అనిపించింది. తర్వాత గాని అర్థం కాలేదు అది నాపై ఉన్న అపార ప్రేమ అని” ఒబామా చెప్పుకొచ్చారు.
Also Read: Cattle On Roads: ప్రధాని సొంత రాష్ట్రంలో దారుణం: 500 కోట్లు మంజూరు చేసినా… ఆకలితో అలమటిస్తున్నాయి

మానవమాత్రులకే కాదు. శ్రీకృష్ణుడు అంతటి వాడు కూడా మనుషుల్లాగే భార్యతో చివాట్లు తిన్నవాడే. శ్రీకృష్ణుడు భగవంతుడు కదా ఆయనకు ఇలాంటి బాధలు పడాల్సిన అవసరం ఏంటని మీరు అడగవచ్చు. భగవంతుడు అయినంత మాత్రాన భార్య చేతిలో మినహాయింపులు ఉండవు. ఒకసారి ఏకాంత మందిరానికి శ్రీకృష్ణుడు ఆలస్యంగా వచ్చాడని సత్యభామ బుంగమూతి పెట్టింది. అలక బూనింది. ఎంత బతిమాలినా అలక వీడలేదు. చివరి ప్రయత్నం గా కృష్ణుడు సత్యభామ కాళ్ళు పట్టుకున్నాడు. ఆ తర్వాత నరకాసురుడితో జరిగిన యుద్ధంలో శ్రీకృష్ణుడు సొమ్మ సిల్లి పడిపోతే సత్యభామ రంగంలోకి దిగి ఆ రాక్షసుడిని చంపేసింది.. శ్రీ కృష్ణుడిని కాపాడింది.
_ కాళ్లు మొక్కారని సంబరపడకండి
శ్రావణ మాసంలోనో, కార్తీక మాసంలోనో భార్యలు భర్తల కాళ్ళు మొక్కుతారు. అంతమాత్రాన భర్తలు అధికులమని పొంగిపొర్ల రాదు. అలా విర్ర వీగితే ఏడాదిలో శ్రావణమాసం, కార్తీక మాసం ఒకసారే వస్తాయి. అదే భార్యలు తలుచుకుంటే ప్రతిరోజు శ్రీకృష్ణ, సత్యభామ ఎపిసోడ్లు కార్తీకదీపం సీరియల్ లాగా నడుస్తూనే ఉంటాయి. దానికిక బ్రేక్ ఉండదు. పురాణాల్లో నల భీములు పాకశాస్త్రంలో ప్రావిణ్యులు. అలాగని ఆడవాళ్లకు వంటలు రావా అని అడగకండి. చేతి మీద అట్లకాడ వాత పడగలదు. పార్వతి కోసం దేవదాస్ మందు తాగాడు. మరి పార్వతి ఏం చేసింది అని ప్రశ్నించకండి. నీళ్ళు కలపని “రా” మందు మీ నోట్లో పడగలదు. ముంతాజ్ కోసం షాజహాన్ తాజ్ మహాల్ కట్టాడు. మరి పురుషుల కోసం స్త్రీలు ఏం కట్టారని ఎదురు ప్రశ్న వేయకండి. మీతో పసుపుతాడు కట్టించుకున్నాం. అది చాలదూ అనే సమాధానం వెంటనే రాగలదు. “సూర్యుడు చుట్టూ భూమి.. భూమి చుట్టూ చంద్రుడు తిరగాలి. అది సైన్స్. అలాగే అబ్బాయిల చుట్టూ అమ్మాయిలు తిరగకూడదు.

అది నాన్సెన్స్. ఈ మాటలతో అమ్మాయిలు పడగొడతారు. అబ్బాయిలు పడిపోతారు” అని జల్సా సినిమాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పకనే చెప్పాడు. ఏతా వాతా చెప్పొచ్చేది ఏంటంటే పురాణాలైనా, ఇతిహాసాలైనా, సౌగంధిక గ్రంథాలైనా ఫిమేల్ దే డామినేషన్ అని చెబుతున్నాయి. అందుకే మీ భార్యలను ప్రేమించండి. ఆమె గంటల తరబడి షాపింగ్ చేసినా ఏమీ అనకండి. డెబిట్ కార్డ్ చే క్కించుకున్నా, క్రెడిట్ కార్డ్ పర్సులో పెట్టుకున్నా మారు మాట్లాడకండి. ఈ ఆర్టికల్ మొదటనే చెప్పుకున్నాం కదా! మండే స్వభావం ఉన్న వస్తువులకు దూరంగా ఉండాలని.. ఏదో సరదాకి అంటున్నాం కానీ.. కార్యేషు దాసి.. కరణేషు మంత్రి.. భోజ్యేషు మాత.. శయనేషు రంభ.. ఇదే నిజం. ఈ వాక్యాలే స్త్రీ ఔన్నత్యానికి అసలైన సిసలైన నిర్వచనం.
Also Read: Bank Service Charges: బ్యాంకు సేవలన్నీ ఉచితం కాదు: వేటికెంత వసూలు చేస్తారో తెలుసా…
[…] Also Read: Husband And Wife Relationship: భార్యలంటే మామూలోళ్ళా: అట్… […]