Srikakulam : అందరి ఎదుటే ఈడ్చికొచ్చిన భూతశక్తి.. చేతబడి ఈ మహిళను ఎంత పనిచేసిందంటే?

తన భూత శక్తితో ఎక్కడో రెండు వీధుల అవతల ఉన్న వాడిని ఈడ్చుకుంటూ రప్పించాడు. తానే చిల్లంగి పెట్టినట్టు ఆయన అందరి ఎదుట బహిరంగంగా ఒప్పుకున్నాడు. దీంతో ఆ మహిళ తేరుకుంది. అనారోగ్యం నుంచి బయటపడింది.

Written By: Dharma, Updated On : June 18, 2023 11:58 am
Follow us on

Srikakulam : చిల్లంగి, చేతబడి, బాణామతి…ఇలా పేర్లు వేరైనా వీటి లక్ష్యం ఒక్కటే. ఎదుటి మనిషి ప్రాణాన్ని పీడించడం. ప్రాణహాని తలపెట్టడం. ఇప్పటికీ గ్రామాల్లో ఈ చిల్లంగి అనే మాట కనుమరుగు కావడం లేదు. శ్రీకాకుళం జిల్లాతో పాటు ఒడిశాలో వీటి మూలాలు ఇప్పటికీ సజీవం. వీటి గురించి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా రచ్చబండ దగ్గర కూర్చొని ప్రస్తావిస్తే.. ఓ పెద్దాయన గగుర్పాటుకు గురిచేసే విషయాలు చెప్పాడు. 80 వ దశకంలో జరిగిన యధార్థ గాథను చెప్పి చిల్లంగి వాస్తవమేనని చెప్పాడు. ఆయన మాటల్లోనే.

‘మా బంధువుల ఇంట్లో వివాహం జరగాల్సి ఉంది. ఆ ఇంట్లో మహిళకు ఉన్నపళంగా సుస్తి చేసింది. ఆస్పత్రికి తీసుకెళితే ఏ జబ్బూ లేదని చెప్పారు. రోజురోజుకు పరిస్థితి విషమిస్తోంది. తిండి లేక అచేతనంగా పడి ఉంది. వివాహం తేదీ దగ్గరవుతోంది. కొందరు చిల్లంగి అని అనుమానం వ్యక్తం చేశారు. భూత వైద్యుడ్ని సంప్రదించాలని సూచించారు. ఎక్కడో 20 మైళ్లలో ఉండే భూత వైద్యుడి వద్దకు చేరుకోవాలంటే చాలా కష్టం. ఇప్పటిలాగా వాహనాలు ఉండేవి కావు. పైగా రాత్రిపూటే అతడు అందుబాటులో ఉంటాడు. భూతవైద్యుడి వద్దకు వెళ్లాలంటే చాలారకాల జాగ్రత్తలు తీసుకోవాలి.
అతడు చాలా భయంకరంగా ఉంటాడు. అందుకే భూత వైద్యుడ్ని తీసుకొచ్చేందుకు ముగ్గురుం బయలుదేరాం. తలో ఒక సీసా సారా తాగాం. దీపం బుడ్డీ వెలుగులో బయలుదేరాం. సరిగ్గా భూత వైద్యుడి ఇంటికి వెళ్లేసరికి ఆసనం వేసుకొని సిద్ధంగా ఉన్నాడు. రండి రా.. మీరు వస్తారని తెలుసురా అనేసరికి మాకు చాలా భయం వేసింది. మీరు ధైర్యంగా ఉంటే ఆ మహిళకు చిల్లంగి పెట్టిన వాడిని మంత్రాలతో ఈడ్చుకొని వస్తానంటూ చెప్పాడు. తనకు రెండు సీసాల సారా కావాలంటూ భూత వైద్యుడు అడగడంతో వెనువెంట సర్దుబాటు చేశారు.
అక్కడి నుంచి భూత వైద్యుడితో పాటు ముగ్గురం గ్రామానికి బయలుదేరాం. సరిగ్గా గ్రామానికి వచ్చేసరికి తెల్లవారుజాము అయ్యింది. అప్పటికే గ్రామపెద్దలు అక్కడకు చేరుకున్నారు. వారి సమక్షంలోనే ఆ మహిళను అక్కడకు తెచ్చి పూజలు ప్రారంభించాడు భూత వైద్యుడు. తనకున్న శక్తితో చిల్లంగి పెట్టిన వాడిని ఆ స్థానానికి తీసుకొచ్చాడు. మనుషుల ద్వారా కాదు. తన భూత శక్తితో ఎక్కడో రెండు వీధుల అవతల ఉన్న వాడిని ఈడ్చుకుంటూ రప్పించాడు. తానే చిల్లంగి పెట్టినట్టు ఆయన అందరి ఎదుట బహిరంగంగా ఒప్పుకున్నాడు. దీంతో ఆ మహిళ తేరుకుంది. అనారోగ్యం నుంచి బయటపడింది. చిల్లంగి పెట్టిన వ్యక్తికి గ్రామస్థులు దేహశుద్ధి చేశారు. మరోసారి చేతబడి జోలికి ఫోనని లిఖిత పూర్వకంగా తీసుకున్నారు. ఇప్పటికీ చేతబడి, చిల్లంగి గ్రామాల్లో ఉన్నాయని, జాగ్రత్తగా ఉండకుంటే మూల్యం తప్పదు’ అని పెద్దాయన హెచ్చరిస్తూ కథను ముగించారు..