Dubai Gold: మనదేశంలో మహిళలకు బంగారం అంటే ఎంత ఇష్టమో తెలుసు. బంగారం కోసం కట్టుకున్న మొగుడినైనా కట్టడి చేస్తారు. అంతగా దానికి విలువ ఇస్తుంటారు. ఆభరణాలు వేసుకోవడమంటే వారికి మహా ఇష్టం. అందుకే బంగారం కొనుగోలుకు ఎక్కువ శ్రద్ధ చూపిస్తుంటారు. నగలు ధరించడానికి స్త్రీలు ఎంత ప్రాధాన్యం చూపుతారో తెలియంది కాదు. అన్ని దేశాల కంటే దుబాయ్ లో బంగారం ధరలు తక్కువగా ఉంటాయి. దీంతోనే ఎక్కువ మంది అక్కడ బంగారం కొనుగోలు చేయాలని భావిస్తుంటారు. బంగారం ధరలు అక్కడ ఎందుకు తక్కువగా ఉంటాయో తెలుసుకుంటే మనకు ఆశ్చర్యమే కలుగుతుంది. బంగారం కోసం మన దేశంలో ఉన్న ఉత్సాహం అక్కడ ఉండదు. వారు ఏదో మామూలుగా చూస్తారు.

దుబాయ్ లో బంగారం విక్రయం ప్రధాన వనరుగా ఉంటుంది. అందుకే బంగారం బిస్కెట్లు, బార్ ల రూపంలో కొనుగోలు చేసేందుకు సిద్ధపడుతుంటారు. బంగారంపై దిగుమతి పన్ను ఉండదు. బంగారు ఆభరణాలపై ఐదు శాతం మాత్రమే పన్ను విధిస్తారు. అందుకే అక్కడ బంగారానికి అధిక ధరలు ఉండవు. కానీ మన దేశంలో బంగారం దిగుమతి చేసుకోవాలంటే భారీ మొత్తంలో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అందుకే బంగారం ధరలు మన దగ్గర ఎక్కువ ఉంటున్నాయి. దీంతో మనం బంగారం కొనాలంటే భారీ ధరలు చెల్లించాల్సిందే.
దుబాయ్ లో ఇన్ కమ్ టాక్స్ కూడా కట్టాల్సిన అవసరం ఉండదు. బంగారం కొనుగోలు చేస్తే ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అగత్యం ఏర్పడదు. బంగారం విక్రయాల ద్వారా అధిక మొత్తంలో డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే అక్కడి ప్రభుత్వం పన్నులు వేసేందుకు వెనకాడుతుంది. దీంతోనే అక్కడ బంగారం ధరలు అందుబాటులో ఉంటాయి. బంగారం వ్యాపారం అక్కడ సాధారణంగా కొనసాగుతుంది. దుబాయ్ నుంచి వచ్చే వారు వారి శరీరంపై 20 గ్రాముల బంగారం తీసుకురావచ్చు. అదే మహిళలైతే 40 గ్రాములు తీసుకొచ్చుకోవచ్చు.

బంగారం ఖరీదు మగవారికైతే రూ.50 వేలు, ఆడవారికైతే రూ. లక్ష వరకు పరిమతి ఉంటుంది. అంతకు మించితే కస్టమ్స్ పనను వసూలు చేస్తారు. అక్కడ ఆరు నెలల కంటే ఎక్కువ కాలం ఉన్న వారు కిలో బంగారం వరకు తీసుకురావచ్చు. అదే ఆరు నెలల లోపు వస్తే సుంకం చెల్లించాల్సిందే. ఎక్కువ కాలం ఉన్న వారు పరిమితికి మించి బంగారం తీసుకొస్తే కస్టమ్స్ సుంకం పెద్ద మొత్తంలో చెల్లించి పెద్ద మొత్తంలో బంగారం తేవచ్చు. ఇలా బంగారం విషయంలో కొన్ని పరిమితులు ఉండటం సహజమే. అది దేశ దేశాలకు వేరువేరు పరిమితులు ఉన్నాయి. ఇందులో భాగంగానే మనం దుబాయ్ నుంచి బంగారం తీసుకొచ్చుకునే విషయంలో పాటించాల్సిన నిబంధనలు ఇవే. వీటిని పాటిస్తేనే మనకు ఇబ్బందులు ఉండవు.