https://oktelugu.com/

MLC Kavitha Phones: ధ్వంసమైన ఆ 10 ఫోన్లను కవిత ఎలా తెచ్చిందబ్బా?

MLC Kavitha Phones: దేశవ్యాప్తంగా ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కాం తీవ్ర చర్చనీయాంశమవుతున్నది.. ఈ కేసులో ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చాలామందిని అరెస్టు చేసింది. భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవితను పలు దఫాలుగా విచారించింది. ఇంకెన్ని సార్లు విచారిస్తుందో తెలియదు. ప్రస్తుతానికి అయితే కవిత సేఫ్ అని భారత రాష్ట్ర సమితి నాయకులు, లేదు లేదు ఈడి వదలబోదు అని భారతీయ జనతా పార్టీ నాయకులు కామెంట్లు చేస్తున్నారు.. అసలే ఇప్పుడు సోషల్ మీడియా రోజులు […]

Written By:
  • Rocky
  • , Updated On : March 22, 2023 / 04:12 PM IST
    Follow us on

    MLC Kavitha Phones

    MLC Kavitha Phones: దేశవ్యాప్తంగా ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కాం తీవ్ర చర్చనీయాంశమవుతున్నది.. ఈ కేసులో ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చాలామందిని అరెస్టు చేసింది. భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవితను పలు దఫాలుగా విచారించింది. ఇంకెన్ని సార్లు విచారిస్తుందో తెలియదు. ప్రస్తుతానికి అయితే కవిత సేఫ్ అని భారత రాష్ట్ర సమితి నాయకులు, లేదు లేదు ఈడి వదలబోదు అని భారతీయ జనతా పార్టీ నాయకులు కామెంట్లు చేస్తున్నారు.. అసలే ఇప్పుడు సోషల్ మీడియా రోజులు కాబట్టి.. ఏ చిన్నపాటి సంఘటన జరిగినా మీమర్స్ ఊరుకుంటారా.. ఇప్పుడు కవిత విచారణకు సంబంధించి కూడా ట్రోల్స్ చేస్తున్నారు.

    కవిత ఈడీ విచారణ నేపథ్యంలో తెలంగాణ క్యాబినెట్లో ముప్పావు వంతు మంత్రులు ఢిల్లీలోనే తిష్ట వేశారు. మంత్రి కేటీఆర్ అయితే ఢిల్లీలోని కేసీఆర్ నివాసంలో ఉంటున్నారు. అక్కడ కవితను విచారిస్తున్న తీరును పరిశీలిస్తున్నారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తున్నారు. అయితే కవిత గతంలో మాట్లాడిన మాటలు, నిన్న ఉదయం 11:30 నిమిషాలకు మీడియా విలేకరులకు చూపించిన ఫోన్లను, విచారణలో జరుగుతున్న పరిణామాలను ఉటంకిస్తూ వీడియోలు రూపొందిస్తున్నారు.. ఇలా కవిత పేరు లిక్కర్ స్కాంలో వినిపించిన దగ్గర్నుంచి ఇవాల్టి వరకు వందల కొద్ది వీడియోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.

    MLC Kavitha Phones

    పైగా ఇప్పటి మీమర్స్ లో క్రియేటివిటీ లెవెల్స్ ఎక్కువ కాబట్టి.. ఈడి దర్యాప్తులో బయటకు వస్తున్న విషయాలను, మీడియా చెబుతున్న విషయాలను ప్రస్తావిస్తూ వీడియోలు రూపొందిస్తున్నారు.. దీనివల్ల చూసే ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నారు. ఏ మాటకు ఆ మాటే.. ఇటీవల కాలంలో మీమర్స్ కు కవిత లిక్కర్ స్కాం చేతినిండా పని కల్పించింది. గతంలో ఈ స్థానాన్ని బిగ్ బాస్ ఆక్రమించేది.. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ ప్రారంభం కాకపోవడం, దానికి మరికొద్ది సమయం పట్టే అవకాశం ఉండడంతో.. దానిని లిక్కర్ స్కాం ఘటనలతో మీమర్స్ భర్తీ చేస్తున్నారు..

     

    https://www.youtube.com/watch?v=kD9wFFjIlrY