Honda Activa E vs Suzuki
Honda Activa E vs Suzuki : భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది.తాజాగా, భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో రెండు ప్రముఖ స్కూటర్ బ్రాండ్లు.. హోండా,సుజుకి తమ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను ఆవిష్కరించాయి. హోండా తమ యాక్టివా ఈ స్కూటర్‌ను, సుజుకి ఈ-యాక్సెస్ స్కూటర్‌ను పరిచయం చేశాయి. రెండు స్కూటర్ల మధ్య తేడాలు, రేంజ్, ఫీచర్ల వివరాలు తెలుసుకుందాం. అలాగే ఈ స్కూటర్ల మధ్య ఉన్న తేడాలను పరిశీలిద్దాం.
ఫీచర్లు
హోండా యాక్టివా ఈ
* ఎల్ఈడీ లైటింగ్ సెటప్: రాత్రిపూట మంచి విజిబిలిటీ అందిస్తుంది.
* రివర్స్ మోడ్: తేలికగా వెనక్కు వెళ్లే సౌకర్యం.
* ఆటో బ్రైట్‌నెస్ అడ్జస్టబుల్: లైటింగ్ ప్రకాశం ఆటోమేటిక్‌గా మారుతుంది.
* స్మార్ట్ కీ సిస్టమ్: స్కూటర్‌ను కీ ద్వారా అనుసంధానించుకోవచ్చు.
* టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే: బ్యాటరీ స్టేటస్, టైమ్ వంటి వివరాలు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.
సుజుకి ఈ-యాక్సెస్
* బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన TFT క్లస్టర్: టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్ మరియు మెసేజ్ నోటిఫికేషన్స్ అందుబాటులో ఉంటాయి.
* USB ఛార్జింగ్ పోర్ట్: మొబైల్ ఛార్జింగ్ కోసం ప్రత్యేక సదుపాయం.
* సైడ్ స్టాండ్ అలర్ట్: స్టాండ్ అమర్చకుండా స్టార్ట్ చేస్తే అలర్ట్ ఇవ్వబడుతుంది.
* స్మార్ట్ కీ: స్కూటర్ సాఫీగా ఆపరేట్ చేసుకునే అవకాశం.
బ్యాటరీ సామర్థ్యం, రేంజ్
హోండా యాక్టివా ఈ
* 1.5 కిలోవాట్ బ్యాటరీలు: స్కూటర్‌లో రెండు రిమూవబుల్ బ్యాటరీలు ఉన్నాయి.
* రేంజ్: ఒక సింగిల్ ఛార్జ్‌పై 102 కిలోమీటర్లు ప్రయాణించగలదు.
సుజుకి ఈ-యాక్సెస్
* 3.07 కిలోవాట్ లిథియం ఐరన్ బ్యాటరీ: శక్తివంతమైన బ్యాటరీతో ఆకర్షణీయమైన పనితీరు.
* రేంజ్: ఒక ఛార్జ్‌పై 95 కిలోమీటర్లు ప్రయాణించగలదు.
రైడింగ్ మోడ్స్
* హోండా యాక్టివా ఈ : ఎకానమీ, స్టాండర్డ్, స్పోర్ట్ మోడ్స్.
* సుజుకి ఈ-యాక్సెస్: ఎకానమీ, స్టాండర్డ్, స్పోర్ట్ మోడ్స్.
ఎంపికలో కీలకాంశాలు
హోండా యాక్టివా ఈ: ఎక్కువ రేంజ్, అధిక పవర్, వేగవంతమైన ప్రయాణం కోసం సరైనది.
సుజుకి ఈ-యాక్సెస్: ఆధునిక టెక్నాలజీ ఫీచర్లు, TFT డిస్‌ప్లే, మరియు బ్లూటూత్ కనెక్టివిటీ వంటి సౌకర్యాల కోసం బెస్ట్.
ప్రయాణ అవసరాలు అధిక రేంజ్, స్పీడ్, పవర్ అయితే హోండా యాక్టివా బెస్ట్ ఆఫ్షన్. టెక్నాలజీ సౌకర్యాలు, కనెక్టివిటీ ఫీచర్లు అవసరం అనుకుంటే సుజుకి ఈ-యాక్సెస్ ఉత్తమ ఎంపిక. రెండు వాహనాలు తమదైన ప్రత్యేకతలతో భారతీయ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. మరి మీ సెలక్షన్ ఏది ?
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Honda activa e vs suzuki honda activa e vs suzuki e access electric scooter battle
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com