Pushpa 2
Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ సెన్సేషన్ పుష్ప 2 ఓటీటీ విడుదల కోసం ప్రేక్షకులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దేశవ్యాప్తంగా ఈ సినిమాకి బుక్ మై షో యాప్ ద్వారా 7 కోట్ల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. వందేళ్ల ఇండియన్ సినీ చరిత్రలో అత్యధిక టికెట్స్ అమ్ముడుపోయిన టాప్ 10 చిత్రాలలో ఒకటిగా స్థానాన్ని దక్కించుకున్న ఈ చిత్రం సరికొత్త చరిత్రని సువర్ణాక్షరాలతో లిఖించింది. ఇంతమంది థియేటర్స్ లో చూసినప్పటికీ కూడా ఇంకా ఈ చిత్రం ఓటీటీ విడుదల కోసం ఎదురు చూస్తున్నారా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే మన దేశం లో వంద కోట్లకు పైగా జనాలు ఉన్నారు. ఇందులో థియేటర్స్ కి వెళ్లి సినిమాలు చూసేవారు సంఖ్య యావరేజ్ గా 10 శాతం కూడా ఉండదు. సినిమాలు మీద ఇష్టం ఉన్నప్పటికీ థియేటర్స్ లో చూసి సమయం ఎందుకు వృధా చేసుకోవడం?, టీవీ లేదా ఓటీటీ లో వచ్చినప్పుడు చూసుకోవచ్చులే అని అనుకునేవాళ్లు ఉంటారు.
వాళ్లంతా ఓటీటీ విడుదల తేదీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఓటీటీ ద్వారా ఇంత భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న సినిమాలకు 7 నుండి 10 కోట్ల వ్యూస్ వస్తాయి. అంటే అంత మంది చూస్తారు అన్నమాట. అలాంటి ఆడియన్స్ అందరూ ఈ చిత్రం కోసం ఇప్పుడు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పైగా రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించి 20 నిమిషాల అదనపు సన్నివేశాలను జత చేసారు. ఈ వెర్షన్ తో కలిపి ఓటీటీ లో విడుదల చేస్తారట. అయితే ప్రేక్షకుల ఎదురు చూపులకు తెరదించుతూ ఈ సినిమా ఈ నెల 29 లేదా 31వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.
సినిమా వాస్తవ నిడివి 3 గంటల 20 నిమిషాలు. రీసెంట్ గా జత చేసిన 20 నిమిషాలతో కలిపి, మొత్తం 3 గంటల 40 నిమిషాల నిడివి ఉన్న సినిమా మనకి అందుబాటులోకి రానుంది. ఈ చిత్రానికి ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ వద్ద 1850 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇప్పటికీ థియేటర్స్ లో ఈ చిత్రం విజయవంతంగా నడుస్తుంది. బుక్ మై షో యాప్ లో రోజుకి 20 వేలకు పైగా టిక్కెట్లు ఇప్పటికీ అమ్ముడుపోతూనే ఉన్నాయి. రీసెంట్ గా సంక్రాంతి కానుకగా విడుదలైన ‘గేమ్ చేంజర్’ మరియు ‘డాకు మహారాజ్’ వంటి చిత్రాలను కూడా ఈ సినిమా డామినేట్ చేసిందంటే ఏ రేంజ్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు. బాలీవుడ్ ఆడియన్స్ కి అయితే ఇప్పటికీ పుష్ప 2 చిత్రమే మొదటి ఛాయస్ గా ఉన్నది.
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Pushpa 2 finally ready for ott release since when can you watch it on netflix
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com