
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా ఎంత మంచి క్రేజ్ తెచుకున్నాడో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ప్రపంచం మొత్తం ఇప్పుడు ఈ క్రేజీ హీరో వైపు చూస్తుంది.ప్రస్తుతం ఆయన శంకర్ తో ‘గేమ్ చేంజర్’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా కోసం కేవలం రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, కోలీవుడ్, బాలీవుడ్ మరియు హాలీవుడ్ ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది, వచ్చే సంక్రాంతి కానుకగా థియేటర్స్ లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కాన్సెప్ట్ వీడియో కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.ఇక ప్రస్తుతం క్లైమాక్స్ సన్నివేశానికి సంబంధించిన షెడ్యూల్ చిత్రీకరణతో మూవీ పూర్తి అవుతుందట.ఈ సినిమా పూర్తి అయిన తర్వాత రామ్ చరణ్ కొంతకాలం షూటింగ్స్ కి విరామం ఇవ్వాలని అనుకుంటున్నాడు అట.

ఎందుకంటే ఉపాసన గర్భం దాల్చి ఆరు నెలలు పూర్తి అయ్యింది.ఇది 7 వ నెల అట, చివరి మూడు నెలలు ఆమె పక్కనే ఉంటూ అవసరాలన్నీ చూసుకోవాలని రామ్ చరణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది..అంతే కాదు #RRR చిత్రం తర్వాత రామ్ చరణ్ తీరిక సమయం గడిపిందే లేదు.#RRR పూర్తి అవ్వగానే శంకర్ సినిమాకి షిఫ్ట్ అయిపోయాడు, ఆ తర్వాత మధ్యలో #RRR మూవీ కి అంతర్జాతీయ అవార్డ్స్ రావడం,ఈయన ప్రతీ అవార్డు ఫంక్షన్ కి తప్పకుండా హాజరు కావాల్సిన పరిస్థితి రావడం తో పాటుగా ఆస్కార్ అవార్డ్స్ ప్రొమోషన్స్ కోసం సుమారుగా నెల రోజుల పాటు అమెరికా లో ఇంటర్వ్యూస్ ఇస్తూ వచ్చాడు.
ఇలా క్షణకాలం తీరిక లేకుండా గడిపిన ఆయనకి కాస్త విశ్రాంతి కోసం కూడా ఈ మూడు నెలలు విరామం తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.ఆ తర్వాత వెంటనే ఆయన బుచ్చి బాబు తెరకెక్కించబోయ్యే సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు.