
Shaakuntalam Collections: టాలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాల హవా నడుస్తుంది కదా అని ఇష్టమొచ్చినట్టు సినిమాలను తీస్తే ఆడియన్స్ మొహమాటం లేకుండా తిరస్కరిస్తున్నారు అనే విషయం రీసెంట్ గా విడుదలైన ‘శాకుంతలం’ మూవీ ఫలితం చూస్తే అర్థం అయిపోతుంది. సమంత ప్రధాన పాత్రలో డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ నుండే ఆడియన్స్ ని ఆకట్టుకోవడం లో విఫలం అయ్యింది.
ఇక విడుదల తర్వాత మొదటి రోజు మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ రావడం తో కనీస స్థాయి ఓపెనింగ్ ని కూడా దక్కించుకోలేకపోయింది ఈ చిత్రం. అమెరికా లో సమంత కి ఒక బ్రాండ్ ఇమేజి ఉండడం వల్ల అక్కడ కాస్త పర్వాలేదు అనే రేంజ్ ఓపెనింగ్ వచ్చింది కానీ, తెలుగు స్టేట్స్ లో మాత్రం డిజాస్టర్ ఓపెనింగ్ వచ్చింది. మొత్తం మీద మొదటి వారానికి కలిపి ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాము.
మొదటి రోజు ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా అన్నీ భాషలకు కలిపి రెండు కోట్ల 24 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇలాంటి ప్రాజెక్ట్స్ కి ఈ ఓపెనింగ్ కేవలం నైజాం ప్రాంతం నుండి రావాలి,కానీ వరల్డ్ వైడ్ కలిపి వచ్చిందటే ఎంత డిజాస్టర్ ఓపెనింగ్ అనేది అర్థం చేసుకోవచ్చు. ఇక రెండవ రోజు 71 లక్షలు, మూడవ రోజు 65 లక్షల రూపాయిలను రాబట్టిన ఈ సినిమా సోమవారం నుండి మరింత తక్కువ వసూళ్లను రాబట్టింది.సోమవారం రోజు అనగా నాల్గవ రోజు 28 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసిన ఈ సినిమా, 5 వ రోజు కేవలం 16 లక్షలు మాత్రమే వసూలు చేసింది.ఆరవ రోజు అందులో 50 శాతం కూడా రాబట్టలేదు.ఇక 7 వ రోజు అన్నీ ప్రాంతాలలో జీరో షేర్స్ నమోదు చేసింది.మొత్తం మీద వారం రోజులకు కలిపి ఈ సినిమా 4 కోట్ల 10 లక్షల రూపాయిలను రాబట్టింది.

ఈ చిత్రాన్ని 50 కోట్ల రూపాయిల బడ్జెట్ తో తీశారు, సమంత కి అంత మార్కెట్ లేకపోవడం తో కేవలం 18 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది.అంటే నిర్మాతకి మరియు బయ్యర్స్ కి సుమారుగా 14 కోట్ల రూపాయిల నష్టం వాటిల్లింది అన్నమాట.గుణ శేఖర్ ఈ చిత్రానికి తన దగ్గరున్న డబ్బులు మొత్తాన్ని ఖర్చు పెట్టి తీసాడు, ఇప్పుడు ఈ సినిమా తో ఆయన జీవితం రోడ్డు మీదకి వచేసినట్టే అని అంటున్నారు ట్రేడ్ పండితులు.