HIT 2 Collections: నేటి తరం థ్రిల్లర్ సినిమాల కథానాయకుడిగా మంచి క్రేజ్ దక్కించుకున్న అడవి శేష్ హీరో గా న్యాచురల్ స్టార్ నానీ నిర్మాణం లో తెరకెక్కిన ‘హిట్ 2’ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైన సంగతి తెల్సిందే..ఆసక్తికరమైన ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను రేకెత్తించిన ఈ చిత్రం, ఆ అంచనాలను మొదటి ఆట నుండే అందుకోవడం లో సఫలమైంది..టాక్ బాగా అవడం తో ఓపెనింగ్స్ కూడా ప్రతి చోట కుమ్మేసాయి.

విడుదలకి ముందు కేవలం A సెంటర్స్ లోనే ఈ సినిమా ఓపెనింగ్స్ బాగుంటాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేశారు..కానీ అనూహ్యంగా ఈ సినిమాకి బీ , సి సెంటర్స్ లో కూడా ఓపెనింగ్స్ అదిరిపోయాయి..హిట్ సినిమా కి సీక్వెల్ కావడం , టాక్ బాగా రావడం తో పాటుగా అడవి శేష్ బ్రాండ్ ఈ సినిమా ఓపెనింగ్స్ కి బాగా పనికొచ్చింది..ఇక మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టిందో ఇప్పుడు చూద్దాము.
ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ దగ్గర నుండి అద్భుతమైన ట్రెండ్ ని చూపించిన ప్రాంతం నైజాం..ఇక్కడ ఈ సినిమాకి మొదటి రోజు రెండు కోట్ల రూపాయలకు పైగానే సరే వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయట..సాయంత్రం షోస్ అయితే స్టార్ హీరో సూపర్ హిట్ సినిమాకి ఎలాంటి ఆక్యుపెన్సీలు ఉంటాయో అలాంటి ఆక్యుపెన్సీలు ఈ సినిమాకి కూడా ఉన్నట్టు ట్రేడ్ పండితులు చెప్తున్నారు.
ఇక మాస్ సినిమాలకు బంపర్ ఓపెనింగ్స్ ఇచ్చే సీడెడ్ వంటి ప్రాంతం లో ఒక థ్రిల్ సినిమా అయినా హిట్ 2 కి మంచి ఓపెనింగ్ రావడం విశేషం..ఇక్కడ ఈ సినిమాకి మొదటి రోజు 50 లక్షలకు పైగానే షేర్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందట..కోస్తాంధ్ర ప్రాంతం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఇక్కడ కూడా ఈ సినిమాకి బంపర్ ఓపెనింగ్ దక్కింది..ఓవర్సీస్ లో అయితే ఈ సినిమాకి కేవలం ప్రీమియర్ షోస్ నుండే రెండు లక్షల డాలర్లు వచ్చినట్టు సమాచారం.

మొదటి రోజు వసూళ్లు కూడా అదే రేంజ్ లో ఉండబోతుందట..మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి మొదటి రోజు 8 నుండి 9 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట..ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 15 కోట్లకు జరిగింది..మొదటి రోజే 50 శాతం కి పైగా రికవరీ చెయ్యడం చూస్తుంటే మార్కెట్ లో అడవి శేష్ మార్కెట్ సినిమా సినిమాకి బాగా పెరిగిపోతుంది అనే విషయం అర్థం అవుతుంది.