Border 2 Review: బాలీవుడ్ ఇండస్ట్రీకి గత కొన్ని రోజుల నుంచి సక్సెసులైతే దక్కడం లేదు. ఇక రీసెంట్ గా వచ్చిన ‘దురంధర్’ సినిమాతో మంచి విజయాన్ని సాధించారు…ఇక ఆ తర్వాత వస్తున్న కొన్ని సినిమాలు కూడా సక్సెస్ లను సాధించినట్లయితే బాలీవుడ్ ఇండస్ట్రీ మరోసారి టాప్ లెవెల్ కి వెళుతుంది. లేకపోతే మాత్రం మరోసారి డీలాపడిపోయే అవకాశాలైతే ఉన్నాయి… ఇలాంటి క్రమంలోనే 1997 వ సంవత్సరంలో వచ్చిన ‘బార్డర్’ సినిమాకి సీక్వెల్ గా ‘బార్డర్ 2’ అనే సినిమా వచ్చింది. అయితే ఈ సినిమా రీసెంట్ గా రిలీజైంది. ఇక ఈ సినిమా ఎలా ఉంది? సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా? లేదా అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
1971 వ సంవత్సరంలో ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో ఇండియాను ఎదుర్కోవడానికి పాకిస్థాన్ త్రివిధ దళాలు ఎలాంటి యుద్ధం చేశారు…ఇండియా బార్డర్స్ అయిన కాశ్మీర్, పంజాబ్, గుజరాత్ లనుంచి ఇండియా మీద ఎలాంటి దాడులు చేశారు…ఫైనల్ గా ఇండియా పాకిస్తాన్ వాళ్ళను ఎదుర్కొని ఎదురుదాడి ఎలా చేసిందనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
దర్శకుడు ఫస్టాఫ్ అంత బోర్ లేకుండా నడిపిన తీరు బాగుంది… ఎక్కడ కూడా స్టోరీ ని గాని, ప్రెజెంటేషన్ కానీ సైడ్ ట్రాక్ కి వెళ్లకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు… ఇక ప్రథమార్థం మొత్తం సినిమా సెటప్ కోసం వాడుకొని సెకండాఫ్ ను ఎమోషనల్ గా మార్చాడు… ప్రతి సీన్ లో ఏదో ఒక దానితో హై ఇచ్చే ప్రయత్నం చేశాడు. క్లైమాక్స్ సైతం చాలా వరకు ప్రేక్షకుడిని కన్విన్స్ చేసే విధంగానే రాసుకున్నాడు…
ఇక ఈ సీక్వెల్ లో కొత్త ఆఫీసర్స్ గా వరుణ్ ధావన్, దిల్జిత్, అహన్ లను పరిచయం చేసిన విధానం బాగుంది…అలాగే వాళ్ళు చేసిన డ్యూటీ ని కూడా చాలా ఎలివేట్ చేశారు…ఇక వాళ్ల ముగ్గురి మధ్య మొదట్లో గొడవలు ఉండటం ఆ తర్వాత వాళ్ళు కలిసిపోయి డ్యూటీ చేసే సమయంలో ఒకరికోసం ఒకరు ఎలా నిలబడ్డారు అనేది కూడా చాలా బాగా చూపించారు…
ఫస్టాఫ్ ఇంటర్వెల్ లో ఇచ్చిన ట్విస్ట్ సిబినా మొత్తానికే హైలెట్ అయింది… అలాగే వార్ సీన్స్ సైతం ప్రేక్షకులను అలరిస్తాయి…. దర్శకుడు వాటిని హ్యాండిల్ చేసిన విధానం బాగుంది…ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా సెట్ అయింది…దానివల్ల దేశభక్తి సన్నివేశాలు బాగా ఎలివేట్ అయ్యాయి…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
లెఫ్టినెంట్ కల్నల్ గా సన్నీ డియోల్ చాలా మంచి పర్ఫామెన్స్ ఇచ్చాడు… ఆయన చూస్తే నిజమైన ఆఫీసర్ లా అనిపించాడు… వరుణ్ ధావన్ చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషించాడు. ఆయన చాలా రోజుల తర్వాత తనలోని పూర్తి స్థాయి నటుడిని బయటికి తీశాడనే చెప్పాలి…అలాగే అహన్ శెట్టి సైతం పర్లేదు అనిపించాడు… ప్రతి ఒక్క నటుడు వాళ్ల పాత్రలకైతే న్యాయం చేశారు…ఇక మిగిలిన ఆర్టిస్టులందరు పర్లేదు అనిపించారు…
టెక్నికల్ అంశాలు
మ్యూజిక్ ఉన్నంతలో బాగానే ఉంది… ఆర్ ఆర్ విషయం లో స్పెషల్ కేర్ తీసుకున్నారు… ముఖ్యంగా వార్ జరుగుతున్న సమయంలో వచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగా సెట్ అయింది… ఇక సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఎక్కడ అనవసరమైన షాట్స్ వాడకుండా చాలా డీసెంట్ విజువల్స్ అందించారు… యుద్ధ నేపథ్యంలో తీసిన షాట్స్ బాగున్నాయి…ఇక ప్రొడక్షన్ వాల్యూస్ సైతం బాగున్నాయి…
బాగున్నవి
ఇంటర్వెల్ సీన్
సెకండాఫ్
సన్నీ డియోల్, వరుణ్ ధావన్ యాక్టింగ్
బాగోలేనివి
అక్కడక్కడ కొన్ని సీన్స్ లాగ్ అయ్యాయి
కొన్ని రిపీటెడ్ సీన్స్
రేటింగ్ : 2.5/5
ఫైనల్ థాట్ : దేశభక్తి తో చాలా తక్కువ సినిమాలు వస్తాయి…కాబట్టి ఖాళీ సమయంలో వెళ్ళి చూడండి బాగా ఎంజాయ్ చేస్తారు…