RGV Mother : రామ్ గోపాల్ వర్మ లైఫ్ స్టైల్ సమాజానికి అతీతంగా ఉంటుంది. ఒకప్పుడు ఆయన దేశం మెచ్చిన దర్శకుడు. సినిమా మేకింగ్ లో ట్రెండ్ సెట్టర్. అద్భుతమైన సినిమాలు దేశానికి అందించిన డైరెక్టర్. ఇప్పుడు విలాస జీవి. పచ్చిగా చెప్పాలంటే తిరుగుబోతు, తాగుబోతు. రాయడానికి మనం ఇబ్బంది పడతామేమో కానీ ఆయన కొంచెం కూడా ఫీల్ అవడు. అలానే అనుకోండి, తప్పేంటి అంటారు. వర్మ ఆటవిక జీవనానికి అలవాటు పడ్డారు. చనిపోయే వరకు విలాసవంతమైన జీవితం గడపాలని ఫిక్స్ అయ్యాడు. ఆలోచనలు చాలా కమర్షియల్ గా మార్చేశాడు.
ఏదైనా చేసి డబ్బులు సంపాదించు. చేసేది మంచా చెడా అనేది వదిలేయ్. మనిషిగా పుట్టాక మందు, మధువు రుచి చూడాలి. ఎగటు కొట్టేవరకు ఆస్వాదించాలి. ఎక్సట్రా ఎక్సట్రా… వర్మ ఫిలాసపీ చెప్పాలంటే పెద్ద గ్రంథం అవుతుంది. ఇలాంటి వైరుధ్య భావాలు వర్మకు ఎలా వచ్చాయి. ఒక మనిషి సమాజం, స్నేహితులు, బంధువులు, పిల్లల గురించి ఆలోచించకుండా, వారు ఏమనుకుంటారో అని సిగ్గుపడకుండా జుగుప్స కలిగించే పనులు, పబ్లిక్ ఎలా చేయగలడు?… చేయగలడు కాబట్టే ఆయన వర్మ.
వర్మ లైఫ్ స్టైల్ ని ఇష్టపడే వారు ఉన్నారు. చిన్నప్పటి నుండి ఆంక్షలు, బాధ్యతలు, విలువలు అనే చట్రంలో ఇరుక్కుపోయి… స్వేఛ్చ కోరుకునేవారికి వర్మ విచ్చలవిడి జీవితం నచ్చుతుంది. మనిషిలా వందేళ్లు బ్రతకడం కంటే… వర్మలా పది రోజులు బ్రతికితే చాలు అనుకునేవాళ్లు లక్షల్లో ఉన్నారు. ఒక అమ్మాయి కాలిపై ముద్దు పెట్టి, వేళ్ళు నోట్లో పెట్టుకునే వర్మను వాళ్ళ అమ్మగారు ఎలా చూస్తారు? వర్మ గురించి ఆమె ఏమనుకుంటారు? ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం జరిగింది.
అయితే ఆమె మైండ్ సెట్ ఏమిటో తెలిశాక మన మైండ్ బ్లాక్ అవుతుంది. వర్మ తల్లి వర్మలానే ఉంది. బహుశా… మదర్ ఆలోచనా విధానం వర్మకు జన్యుపరంగా సంక్రమించి మించి ఉండవచ్చు. ఆమె తాజా కామెంట్స్ ఆధారంగా ఈ నిర్ణయానికి రావడం జరిగింది. వర్మ తల్లిగారైన సూర్యమ్మ మాట్లాడుతూ… వర్మ జీవితంలో మారేది లేదు. ఎవరో ఏదో అన్నారని వర్మ మారడు. తనకు మారాలి అనిపిస్తే మారతాడు. వర్మ నేను కలిసి గాడ్ సెక్స్ ట్రూత్ మూవీ చూశాము. నేను అంటే వర్మకు చాలా ఇష్టం. ఇంటికి రాగానే నేను కనిపించాలి. నన్ను చూడగానే వర్మ కళ్ళలో ఆనందం కనిపిస్తుందని, ఆమె చెప్పుకొచ్చారు. పోర్న్ మూవీకి దగ్గరగా ఉండే జి ఎస్ టి చిత్రాన్ని కలిసి చేశామని చెప్పి.. వర్మకు తగ్గ తల్లి అనిపించుకున్నారు ఆమె.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: His mother watched an adult movie with ramgopal varma
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com