Bandla Ganesh Adipurush : ట్వీట్స్ నందు బండ్ల గణేష్ ట్వీట్స్ వేరయా అనాలి. ఆయన తనకు సంబంధం లేని విషయాలపై కూడా స్పందిస్తారు. ఆదిపురుష్ మరింత ఆలస్యం కానుందని ఒకరు ట్వీట్ చేయగా… సదరు ట్వీట్ ట్యాగ్ చేసి దండం ఎమోజీ పోస్ట్ చేశాడు. దాని అర్థం ఏమిటో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు అభిమానులు. ఆదిపురుష్ చిత్రం 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలి అనుకున్నారు. ఈ ప్రణాళికలో భాగంగా అక్టోబర్ లో టీజర్ విడుదల చేశారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న రామాయణ గాథ కావడంతో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి.

ముఖ్యంగా రాముడిగా ప్రభాస్ లుక్ ఎలా ఉంటుందనే ఆసక్తి తీవ్ర స్థాయిలో నెలకొంది. తీరా టీజర్ చూశాక జనాలు ఉసూరుమన్నారు. ఏ కోణంలో కూడా ఆదిపురుష్ టీజర్ ఆకట్టుకోలేదు. నాసిరకం గ్రాఫిక్స్, చెత్త విజువల్స్ ఇబ్బంది పెట్టాయి. నాలుగు వందల కోట్లు పెట్టి కార్టూన్ మూవీ తీశారంటూ విమర్శలు వెల్లువెత్తాయి.ప్రభాస్ రాముడి లుక్ ఫ్యాన్స్ కి కిక్ ఇవ్వలేదు. పైకి సూపర్ అంటూ లోపల ఓం రౌత్ ని తిట్టుకున్నారు.
ప్రశంసలు కురుస్తాయి అనుకుంటే విమర్శలు వెల్లువెత్తాయి. రావణాసురుడు లుక్ చూసి హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. హాలీవుడ్ విలన్ ని తలపిస్తున్న రావణాసురుడు గెటప్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవగాహన లేకపోతే ఎన్టీఆర్ లాంటి నటులు చేసిన పౌరాణిక సినిమాలు చూడండి. అసలు మీకు రామాయణం తెలుసా? ఇష్టం వచ్చినట్లు పౌరాణిక పాత్రలను చూపిస్తారా? అని ఓం రౌత్ ని ఏకిపారేశారు. ఆదిపురుష్ మూవీపై అభ్యంతరాలు తలెత్తడంతో పాటు తగు మార్పులు చేయకపోతే సినిమాను అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.
మరోవైపు టీజర్ చూశాక ప్రభాస్ ఓం రౌత్ కి వార్నింగ్ ఇచ్చాడని, పూర్తి అసహనం వ్యక్తం చేశారని ప్రచారం జరిగింది. నిజం ఏదైనా విమర్శల నేపథ్యంలో రిపేర్స్ స్టార్ట్ చేశారు. మరో వంద కోట్ల బడ్జెట్ కేటాయించి మెరుగైన అవుట్ ఫుట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆదిపురుష్ మూవీ మరింత ఆలస్యం కానుంది అంటూ… ఒక నెటిజన్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ని ట్యాగ్ చేస్తూ బండ్ల గణేష్… దండం ఎమోజీ పోస్ట్ చేశారు. బండ్ల గణేష్ ఆ ఎమోజీ ద్వారా… ‘మీకు దండం త్వరగా మూవీ విడుదల చేయండి’ అని చెప్పాడా లేక ‘మీకు దండం మంచి నిర్ణయం తీసుకున్నారు, లేటైనా పర్లేదు మంచి అవుట్ ఫుట్ తో రండి’ అని చెప్పాడా? అనేది అర్థం కాలేదు.
Ok madam 🙏 https://t.co/Ny4wAE3wcs
— BANDLA GANESH. (@ganeshbandla) December 18, 2022