
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత గురువారం ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరుకానుంది. మార్చి 11న జరిపిన విచారణలో తాము అడిగిన ప్రశ్నలకు కవిత సరైన సమాధానాలు చెప్పకపోవడంతో ఈడీ ఈసారి కొత్త విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ఇందులో భాగంగా కన్ ఫ్రంటేషన్ రూపంలో విచారణ నిర్వహించే అవకాశం ఉంది.
బుధవారం ఈడీ అధికారులు కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు, అరుణ్ పిళ్ళయి ని విచారించారు. ఢిల్లీలో లిక్కర్ స్కాంకు సూత్రధారులు ఎవరు? గతంలో ఉన్న విధానాలను మార్చింది ఎవరు? లిక్కర్ వ్యాపారాన్ని కార్టెల్ కు ఎలా అప్పగించారు? ఎవరెవరికి ఎంత స్థాయిలో ముడుపులు ఇచ్చారు? ఢిల్లీలోని బెంగాలీ మార్కెట్ ద్వారా 100 కోట్ల నగదును హైదరాబాద్ ఎలా తరలించారు? సౌత్ గ్రూపులో మీరంతా ఎలా చేరారు? మిమ్మల్ని ఆ దిశగా ప్రేరేపించింది ఎవరు? సౌత్ గ్రూప్ ఆప్ నేతలను ఎందుకు కలిసింది? సమీర్ మహేంద్రు సౌత్ గ్రూప్ లో ఎందుకు వాటాలు కొన్నాడు? ఈ ప్రశ్నలపై వారిని విచారించినట్టు తెలుస్తోంది.. అయితే ఈ ప్రశ్నలకు బుచ్చిబాబు, అరుణ్ పలు కీలక సమాధానాలు చెప్పినట్టు విశ్వసినీయ వర్గాల సమాచారం.
అయితే కవిత విచారణకు ముందు ఒకరోజు బుచ్చిబాబు, అరుణ్ ను ఈడి విచారించింది. వారి వద్ద నుంచి పలు కీలక సమాధానాలు రాబట్టిన తర్వాత వాటిని పూర్తిగా రికార్డు చేసింది.. గురువారం కవితను విచారించే క్రమంలో కాన్ ఫ్రంటేషన్ విధానం పాటించనున్నట్టు తెలుస్తోంది. బుచ్చిబాబు,అరుణ్ లతో కలిపి కవితను విచారించనున్నట్టు సమాచారం..ఎందుకంటే గత విచారణలో కవిత ఎలాంటి విషయాలు వెల్లడించలేదు.. దీంతో ఈడి అధికారులు కాన్ ఫ్రంటేషన్ విధానాన్ని అవలంబిస్తున్నారు.

కాన్ ఫ్రంటేషన్ విధానాన్ని వాస్తవంగా ప్రపంచానికి పరిచయం చేసింది అమెరికా.. పలు కీలక కేసుల్లో, ఆర్థికపరమైన కేసుల్లో అమెరికా ఇటువంటి విచారణ విధానాన్ని అవలంబిస్తుంది.. ముఖ్యంగా కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు అధికారులకు సహకరించని క్రమంలో వారిని ఈ విధానంలో ప్రశ్నిస్తారు.. దీనివల్ల అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని విచారణ అధికారులు భావిస్తారు. ఈ విధానం ద్వారా అమెరికా చాలా కేసుల్లో పురోగతి సాధించిన క్రమంలో.. దేశాలు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి. ప్రస్తుతం లిక్కర్ స్కామ్ కేసులో ఈడి అధికారులు కూడా ఈ విచారణ విధానాన్నే పాటిస్తున్నారు.