
Electric Bikes: పెట్రోల్ ధరలు రోజురోజుకు మండిపోతున్నాయి. దీంతో వాహనదారులు ప్రయాణాలను పొదుపుగా చేస్తున్నారు. ఈ తరుణంలో పెట్రోల్ వినియోగపు వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లోకి రావడంతో చాలా మంది వాటివైపు మొగ్గు చూపుతున్నారు. మొన్నటి వరకు ఈవీ కార్ల హవా సాగింది. ఇప్పుడు టూ వీలర్ కూడా రకరకాలుగా ఆకర్షించే మోడళ్లలో లభించడంతో వాటి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే చాలా మంది ఎక్కవ మైలేజీ వాహనాల కోసం సెర్చ్ చేస్తున్నారు. కొన్ని కంపెనీల ఆయా మోడళ్ల బైక్ లు, అవి ఇచ్చే మైలేజీల గురించి వివరాలు ఆన్లైన్లో పెట్టాయి. వాటిలో కొన్నింటి గురించి మీకోసం.
అల్ట్రావాయిలెట్:
ఈ బైక్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఒకటి స్టాండర్డ్, మరొకటి రెకాన్. స్టాండర్డ్ బైక్ 7.1 KWH బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది కిలోమీటర్ కు 206 కిలోమీటర్ల మైలేజి ఇస్తుంది. రెకాన్ వేరింట్ 10.5 KWH బ్యాటరీ ఉంది. దీనిని ఒక్కసారి చార్జ్ చేస్తే 307 కిలో మీటర్ల మైలేజీ ఇస్తుంది. అయితే ఇది చార్జింగ్ కావడానికి 5 గంటల సమయం తీసుకుంటుంది. దీని ప్రారంభ ధర రూ.3.8 లక్షలు ఉంది. గరిష్టంగా రూ.5.5 లక్షల వరకు విక్రయిస్తున్నారు.

కోమకి రేంజర్:
ఎలక్ట్రిక్ క్రూయిజర్ నుంచి వచ్చిన తొలి బైక్ ఇది. ఇందులో కంపెనీ 3.5 KWH బ్యాటరీని అమర్చారు. దీనిని ఒక్కసారి చార్జి చేస్తే 250 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. గంటకు 80 కిలోమీటర్ల వరకు ప్రయాణించే దీని ధర రూ.1.85 లక్షలు. ఈ బైక్ కు బ్లూటూత్ కనెక్టివిటీ, మొబైల్ చార్జింగ్ పోర్ట్, రివర్స్ మోడ్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి.

ఒబెన్ రోర్:
ఒబెన్ రోర్ ఒక్కసారి చార్జింగ్ చేస్తే 187 కిలోమీటర్లు వస్తుంది. ఈ బైక్ లో 4.4 KWH బ్యాటరీ ఉంది. 2 గంటల్లో బ్యాటరీ ఫుల్ గా మారుతుంది. దీని ధర రూ.1.5 లక్షలు. ఈ బైక్ కు స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ చేసుకోవచ్చు.