
Sreemukhi: స్టార్ యాంకర్ శ్రీముఖి స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారట. ఆమెకు హీరోయిన్ ఆఫర్స్ వచ్చినా చేయడం లేదట. అదేంటి? యాంకర్ హీరోయిన్ గా ప్రమోషన్ కావడం మంచి పరిణామమే కదా. హీరోయిన్ ఆఫర్స్ ఎందుకు తిరస్కరిస్తున్నారని మనకు సందేహం రావచ్చు. ఇక్కడ చిన్న మెలిక ఉంది. శ్రీముఖి పరిశ్రమకు నటి కావాలనే వచ్చారు. యాంకర్ కాకముందు కొన్ని చిత్రాల్లో చిన్నాచితక పాత్రలు చేశారు. 2012లో జులాయి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రాల్లో ఆమె కనిపించారు. అయితే అవి కనీస ప్రాధాన్యత లేని పాత్రలు. కాబట్టి శ్రీముఖి గురించి ఎవరికీ తెలియదు.
చిత్ర పరిశ్రమలో నెగ్గుకురావడం అంత సులభం కాదని ఆమె బుల్లితెర వైపు అడుగులు వేశారు. 2013లో శ్రీముఖి యాంకర్ అయ్యారు. శ్రీముఖికి పటాస్ షో గుర్తింపు తెచ్చింది. ఆ షోతో ఆమె వెలుగులోకి వచ్చారు. అలా మెల్లగా ఎదుగుతూ స్టార్ యాంకర్ అయ్యారు. ప్రస్తుతం బుల్లితెర మీద శ్రీముఖిదే హవా. అన్ని ప్రముఖ ఛానల్స్ లో శ్రీముఖి షోలు చేస్తున్నారు. అదే సమయంలో సినిమాల్లో నటిస్తున్నారు.
శ్రీముఖి చివరిగా మ్యాస్ట్రో మూవీలో నటించారు. ఆ చిత్రంలో విలన్ జిష్షు జోసెఫ్ భార్య రోల్ చేశారు. క్రేజీ అంకుల్స్ తో పాటు మరో మూవీలో శ్రీముఖి హీరోయిన్ గా నటించారు. ఇటీవల శ్రీముఖి ఫేమ్ మరింతగా పెరిగింది. ఈ క్రమంలో చాలా మంది దర్శక నిర్మాతలు హీరోయిన్ ఆఫర్స్ తో శ్రీముఖి ఇంటి మూడు క్యూ కడుతున్నారట. అయితే సింపుల్ గా శ్రీముఖి నో అనేస్తుందట. కారణం స్మాల్ బడ్జెట్ చిత్రాల్లో నటించినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలాగే ఉన్న ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని ఆమె ఆలోచనట.

అందుకే కొత్త చిన్న నిర్మాణ సంస్థలు, డెబ్యూ దర్శకులు, హీరోల చిత్రాల్లో నటించేందుకు శ్రీముఖి సుముఖంగా లేరట. నేను నటించను అని నిర్మొహమాటంగా చెబుతున్నారట. కనీసం పేరున్న వ్యక్తుల మాత్రమే పని చేయాలని అనుకుంటున్నారట. రష్మీ గౌతమ్ కెరీర్ చూసి శ్రీముఖి ఈ నిర్ణయానికి వచ్చారట. రష్మీ ఫార్మ్ లో ఉన్న సమయంలో ఎడాపెడా సినిమాలు తీసింది. అవన్నీ ప్లాప్ కాగా ఇప్పుడు ఆమెను పట్టించుకునే నాథుడు లేదు. అందుకే అనసూయ మాదిరి తెలివిగా కెరీర్ ప్లాన్ చేసుకోవాలని అనుకుంటుందట.