Heroine Tamannaah : సౌత్ ఇండియా లో తమకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజి ని ఏర్పాటు చేసుకున్న అతి తక్కువమంది హీరోయిన్స్ లో ఒకరు తమన్నా. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ ఇలా అన్ని భాషలకు సంబంధించిన ఆడియన్స్ కి ఈమె బాగా సుపరిచితమే. అందంతో కుర్రాళ్ళని వెర్రెక్కిపోయేలా చేయడమే కాకుండా, తన నటనతో మైమరచిపోయేలా చేయడం ఈమె సొంతం. అంతే కాదు ఇండియా లో అత్యద్భుతంగా డ్యాన్స్ వేసే హీరోయిన్స్ లో ఒకరు తమన్నా. ట్రెండ్ కి తగ్గట్టుగా తనని తాను మార్చుకుంటూ ఇప్పటికీ మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్ గా కొనసాగుతున్న ఈమె, గత కొంతకాలం గా బాలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ వర్మ తో ప్రేమాయణం నడుపుతున్న సంగతి అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరు రిలేషన్ లో ఉన్న విషయాన్ని బహిరంగంగానే చెప్పారు, ఇద్దరు డేటింగ్ చేసుకుంటున్నారు కూడా, కానీ పెళ్లి ఎప్పుడు అని అడిగితే మాత్రం ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం సినిమా కెరీర్ మీదనే ఉంది అంటూ చెప్పుకొచ్చింది తమన్నా.
ఇదంతా పక్కన పెడితే అందరి హీరోయిన్స్ లాగానే తమన్నా కి కూడా ఇండస్ట్రీ లో అనేక మంది హీరోలతో అఫైర్స్ నడిపినట్టు పుకార్లు వినిపించాయి. ఇది చాలా సర్వసాధారణమే, ఎందుకంటే ఒక హీరో, హీరోయిన్ కలిసి రెండు మూడు సినిమాల్లో కనిపిస్తే లింక్ పెట్టేస్తుంది మీడియా. దీని వల్ల సదరు హీరో, హీరోయిన్స్ కుటుంబాల్లో లేనిపోని గొడవలు ఏర్పడుతాయి, వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో అనేక మార్పులు సంభవిస్తాయి. అలా తమన్నా విషయం లో కూడా గతంలో జరిగిందట. పూర్తి వివరాల్లోకి వెళ్తే గతం లో తమన్నా పాకిస్థాన్ క్రికెట్ ప్లేయర్ అబ్దుల్ రజాక్ తో ప్రేమాయణం నడిపిందని, ప్రస్తుతం వీళ్లిద్దరు డేటింగ్ చేసుకుంటున్నారని వార్తలు వినిపించాయట. దానికి కారణం వీళ్లిద్దరు కలిసి ఒక ఫోటో లో కనిపించడమే.
ఇద్దరు కలిసి ఒక్క యాడ్ లో కూడా నటించలేదు, వివిధ రంగాలకు చెందిన వీళ్లిద్దరు ఇలా కలవడానికి కారణం ఏమిటి?, వీళ్ళ మధ్య రిలేషన్ ఏమైనా ఉందా అని అప్పట్లో చర్చించుకున్నారు. ఈ రూమర్ వల్ల తమన్నా వ్యక్తిగతంగా చాలా డిస్టర్బ్ అయ్యిందట. దీని పై ఆమె స్పందిస్తూ ‘నేను, అద్బుల్ రజాక్ ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో కలుసుకున్నాము. ఆ సమయం లో తీసిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి, దీంతో మా ఇద్దరి మధ్య ఎదో జరుగుతుంది అన్నట్టుగా మీడియా లో పుకార్లు పుట్టించారు’ అంటూ చెప్పుకొచ్చింది తమన్నా. ఒక అమ్మాయి, అబ్బాయి కలిసి ఒక ఫొటోలో కనిపిస్తే ఇలా లింక్ పెట్టేస్తారా?, సినిమాల్లో నటించే హీరోయిన్స్ అంటే ఎందుకు ఇంత చిన్న చూపు అంటూ సోషల్ మీడియా లో విరుచుకుపడుతున్నారు నెటిజెన్స్. ఇకపోతే తమన్నా ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క వెబ్ సిరీస్‌లతో అల్లాడిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె సంపత్ నంది దర్శకత్వం లో ‘ఓదెల 2 ‘ లో నటిస్తుంది.
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Heroine tamannaah is the first to react to love affair with pakistani cricketer abdul razak
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com