
Heroine Soundarya Son: మహానటి సావిత్రి తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అంతటి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న నటి సౌందర్య. అందం తో పాటు అందం, అభినయం తో పాటు అభినయం కలగలిపిన అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒకరామె.అందుకే ఆమె చనిపోయి ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ మనం మర్చిపోలేక పోతున్నాం.ఆమె పోషించిన అద్భుతమైన పాత్రలు అలాంటివి మరీ.
సౌత్ ఇండియా లో దాదాపుగా అందరి హీరోల సరసన నటించిన ఈమె ఏ హీరో కి అయిన మేడ్ ఫార్ ఈచ్ అథర్ లాగ ఉంటుంది.ఇదంతా కాసేపు పక్కన పెడితే సౌందర్య తన చిన్న నాటి స్నేహితుడు రఘు అనే అతన్ని పెళ్లాడింది.వీళ్లిద్దరి పెళ్లి ఆరోజుల్లో ఇండస్ట్రీ ప్రముఖులు మరియు బంధు మిత్రుల సమక్ష్యం లో ఘనంగా జరిగింది.ఇప్పటికి ఆ ఫోటోలు మరియు వీడియోలు మనం యూట్యూబ్ లో చూడొచ్చు.వీళ్లిద్దరి పెళ్లి 2003 వ సంవత్సరం లో జరిగింది.పక్క సంవత్సరమే ఆమె చనిపోయింది.
సౌందర్య కి తన భర్త రఘు అంటే చాలా ఇష్టం, ఆమె టానికి సంపాదించిన ఆస్తులన్నీ కూడా అతని పేరు మీదనే రాసింది.ఆమె చనిపోయిన తర్వాత ఈ ఆస్తుల విషయం లో రఘు కి మరియు సౌందర్య తల్లితండ్రులకు మధ్య అప్పట్లో గొడవలు కూడా జరిగాయి.ప్రస్తుతం ఆయన రెండవ పెళ్లి చేసుకొని గోవా లో నివసిస్తున్నాడు.ఇదంతా పక్కన పెడితే సౌందర్య చనిపొయ్యే ముందు గర్భం దాల్చిందని.ఆమెకి చిన్న బిడ్డ కూడా పుట్టాడు అంటూ అప్పట్లో ఒక రూమర్ వచ్చింది.సౌందర్య రఘు పెళ్లి చేసుకున్న ఏడాదికి చనిపోయింది.

అంతకు ముందే ఆమె ఒక బిడ్డకి జన్మని ఇచ్చిందని, ప్రస్తుతం ఆ బాబు రఘు వద్దే పెరుగుతున్నాడు అంటూ ఇలా పలు రకాల వార్తలు ప్రచురితం అయ్యింది.అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని సౌందర్య సన్నిహితులు ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు.సౌందర్య పెళ్ళైన రెండేళ్ల వరకు పిల్లల్ని కనకూడదు అని అనుకుందని, సోషల్ మీడియా లో వస్తున్న వార్తల్ని నమోద్దు అంటూ ఈ సందర్భంగా తెలిపారు.