
Pushpa 2 Teaser: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. తెలుగు లో కంటే కూడా ఇతర బాషలలో ఈ సినిమా ఎక్కువ వసూళ్లను నమోదు చూసింది. ఇది నిజంగా ఎవ్వరూ ఊహించని సర్ప్రైజ్ బ్లాక్ బస్టర్ అనే చెప్పాలి.అల్లు అర్జున్ కి నార్త్ ఇండియా లో కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని తెచ్చిపెట్టిన సినిమా ఇది.
అలాంటి సినిమాకి సీక్వెల్ అంటే ఏ రేంజ్ లో ఉండాలో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.అందుకే డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్ర కథ ని చాలా పకడ్బందీగా సిద్ధం చేసాడట. సుమారుగా ఏడాది కి పైగా కూర్చొని ఈ స్క్రిప్ట్ ని సిద్ధం చేసాడట. కాంబినేషన్ నుండి ఎలాంటివి అయితే అభిమానులు మరియు ప్రేక్షకులు ఆశిస్తారో, అంతకు మించి ఉండేలాగా ఉంటుందట ఈ సినిమా. షూటింగ్ ప్రారంభం అయ్యి రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి ఒక క్రేజీ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియా ని షేక్ చేస్తుంది.
అదేమిటి అంటే అల్లు అర్జున్ పుట్టిన రోజు ఏప్రిల్ 8 వ తారీఖున ‘పుష్ప : ది రూల్’ కి సంబంధించిన టీజర్ ని విడుదల చేయబోతున్నారట. మూడు నిమిషాలకు పైగా ఈ యాక్షన్ టీజర్ కట్ ఉండనుందట. దీనికోసం ప్రత్యేకంగా షూటింగ్ ని కూడా జరిపారట మూవీ టీం.దీనితోనే ‘పుష్ప : ది రూల్’ ఎలా ఉండబోతుంది అనే క్లారిటీ అందరికీ వచేస్తుందట. ఈ టీజర్ థియేటర్స్ లో కూడా వేసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.

ఇప్పటికే టీజర్ కట్ సిద్ధం అయిపోయిందట, ప్రస్తుతం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మిక్సింగ్ కార్యక్రమం జరుగుతుంది. కళ్ళు చెదిరిపోయే యాక్షన్ సన్నివేశాలతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి పూనకాలు రప్పించే విధంగా ఉండబోతున్న ఈ యాక్షన్ టీజర్, సోషల్ మీడియా లో ఎన్ని రికార్డ్స్ ని నెలకొల్పుతుందో చూడాలి.త్వరలోనే ఈ టీజర్ కి సంబంధించిన పూర్తి వివరాలను తెలియజెయ్యనున్నారు మేకర్స్.