Rashi Khanna: సాలిడ్ ఫిగర్, టాలెంట్ రాశి ఖన్నా సొంతం. అయితే ఆమె స్టార్ హీరోయిన్ కాలేకపోయారు. రాశి ఖన్నా జతకట్టిన వన్ అండ్ ఓన్లీ స్టార్ హీరో ఎన్టీఆర్. జై లవకుశ చిత్రంలో రాశి ప్రధాన హీరోయిన్ గా నటించారు. జై లవకుశ హిట్ టాక్ తెచ్చుకున్నా రాశి ఖన్నాకు స్టార్స్ పక్కన ఆఫర్స్ రాలేదు. కెరీర్ మొత్తం టైర్ టు హీరోలతోనే సరిపోయింది. ఊహలు గుసగుసలాడే చిత్రంతో పరిశ్రమకు వచ్చిన రాశికి తొలిప్రేమ, జిల్, రాజా ది గ్రేట్ ఫేమ్ తెచ్చాయి. అయితే రాశి కెరీర్లో 2019 బెస్ట్ ఇయర్ గా నిలిచిపోతుంది. ప్రతిరోజూ పండగే, వెంకీ మామ వంటి హిట్ చిత్రాల్లో ఆమె నటించారు.

ప్రతిరోజూ పండగే రూ. 34 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి భారీ విజయం నమోదు చేసింది. ప్రతిరోజూ పండగే సక్సెస్ తో వచ్చిన క్రెడిట్ వరల్డ్ ఫేమస్ లవర్ నాశనం చేసింది. విజయ్ దేవరకొండ మూవీ విషయంలో రాశి ఖన్నా అంచనాలు తప్పాయి. వరల్డ్ ఫేమస్ లవర్ డిజాస్టర్ అయ్యింది. వరల్డ్ ఫేమస్ లవర్ ఫలితం రాశి కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపింది దానికి కారణం… ఆమె బోల్డ్ రోల్ చేశారు. విజయ్ దేవరకొండతో ఆమె శృతిమించిన శృంగార సన్నివేశాల్లో నటించారు. ఆ దెబ్బతో రాశికి టాలీవుడ్ లో ఆఫర్స్ కరువయ్యాయి.
తన కెరీర్ ని అంతగా దెబ్బ తీసినప్పటికీ… విజయ్ దేవరకొండ అంటేనే ఇష్టం అంటుంది రాశి ఖన్నా. తాజాగా ఆమె బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోకి గెస్ట్ గా హాజరయ్యారు. సీనియర్ హీరోయిన్స్ జయప్రద, జయసుధలతో పాటు రాశి ఖన్నా అన్ స్టాపబుల్ టాక్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ… ఇప్పటి వరకు నటించిన హీరోలలో నీ క్రష్ ఎవరని అడిగారు. ఆ ప్రశ్నకు సమాధానంగా రాశి ఖన్నా హీరో విజయ్ దేవరకొండ అని చెప్పింది. వరల్డ్ ఫేమస్ లవర్ మూవీలో బెడ్ రూమ్ సన్నివేశాల్లో నటించిన హీరోని క్రష్ అని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది.

కాగా 2022 రాశి ఖన్నాకు డిజాస్టర్ ఇయర్ గా మిగిలింది. తెలుగులో ఆమె నటించిన పక్కా కమర్షియల్, థాంక్యూ చిత్రాలు దారుణ ఫలితాలు చూశాయి. అయితే కోలీవుడ్ మూవీ సర్దార్ విజయం ఆమెకు కొంతలో కొంత ఉపశమనం కలిగించింది. సర్దార్ తెలుగులో కూడా బ్రేక్ ఈవెన్ దాటి హిట్ టాక్ సొంతం చేసుకుంది. తెలుగులో రాశి కెరీర్ దాదాపు ముగిసినట్లే. ప్రస్తుతం ఆమె హిందీ చిత్రం యోధ లో నటిస్తున్నారు. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ హిట్ అయితే రాశికి బాలీవుడ్ లో ఆఫర్స్ రావచ్చు.