Heroine Poorna: హీరోయిన్ పూర్ణ గత ఏడాది వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. రహస్యంగా ఆమె పెళ్లి జరిగింది. మీడియాకు ఎలాంటి సమాచారం లేదు. పూర్ణ దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీ అనే వ్యక్తితో నిశ్చితార్థం అయినట్లు వెల్లడించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అభిమానులు ఆమెకు బెస్ట్ విషెస్ తెలియజేశారు. నిశ్చితార్థం జరిగి నెలలు గడుస్తున్నా పెళ్లి వార్త రాలేదు. ఈ క్రమంలో బ్రేకప్ అయ్యారంటూ కొన్ని కథనాలు వెలువడ్డాయి. అసిఫ్ అలీతో కలిసి దిగిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసి పుకార్లకు చెక్ పెట్టింది.

కొద్దిరోజుల తర్వాత ఆల్రెడీ నాకు పెళ్ళైపోయిందని బిగ్ బాంబు పేల్చింది. దుబాయ్ లో సన్నిహితుల సమక్షంలో అసిఫ్ అలీతో నా వివాహం ముగిసింది. కొన్ని కారణాల వలన ఎవరినీ వివాహానికి పిలవలేదు. అందుకు బాధగా ఉంది. అయితే చిత్ర ప్రముఖులు, ఇండియాలో ఉన్న బంధువుల కోసం కేరళలో రిసెప్షన్ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నామని పూర్ణ వెల్లడించారు. ఆ మాట చెప్పి చాలా రోజులు అవుతుంది. ఎలాంటి మ్యారేజ్ రిసెప్షన్ నిర్వహించిన దాఖలాలు లేవు.
కాగా ఇటీవల పూర్ణ తల్లిని అయ్యానంటూ ఇస్టాగ్రామ్ స్టేటస్ లో ఓ పోస్ట్ పెట్టారు. పూర్ణ గుడ్ న్యూస్ చెప్పడంతో ఫ్యాన్స్ అభినందించారు. శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే ఆమెలో తల్లి అయిన ఆనవాళ్లు ఏమీ లేవనే వాదన వినిపిస్తోంది. పూర్ణ లేటెస్ట్ ఫోటో షూట్ గమనిస్తే కొంచెం కూడా బేబీ బంప్ లేదు. మూడు నెలలకే గర్భిణీ స్త్రీలకు బేబీ బంప్ రివీల్ అవుతుంది. శారీలో పూర్ణ పొట్ట కనిపిస్తున్న నేపథ్యంలో ఆమె తల్లి అయ్యారని సూచించే సూచనలు కనిపించలేదు.

దీంతో నెటిజెన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు నిజంగా మీరు తలయ్యారా? అని కామెంట్స్ పెడుతున్నారు. మరి నెటిజెన్స్ సందేహాలకు పూర్ణ సమాధానం ఇస్తారో లేదో చూడాలి. కాగా పూర్ణ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. హీరోయిన్ గా ఫేడవుట్ అయిన పూర్ణ క్యారెక్టర్ ఆర్టిస్ట్ తరహా పాత్రలు చేస్తున్నారు. దృశ్యం 2, అఖండ, తీస్ మార్ ఖాన్ చిత్రాల్లో పూర్ణ ఈ తరహా రోల్స్ చేశారు. మరోవైపు బుల్లితెర షోలలో జడ్జెస్ వ్యవహరిస్తున్నారు.
కేరళ అమ్మాయి అయిన పూర్ణకు తెలుగులో చెప్పుకోదగ్గ ఆరంభమే లభించింది. ఆమె హీరోయిన్ గా నటించిన సీమటపాకాయ్, అవును వంటి చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. అయితే స్టార్ హీరోయిన్ గా ఎదిగేందుకు పునాది వేసుకోలేకపోయారు.