Poorna- Hyper Aadi: పాప్యులర్ డాన్స్ రియాలిటీ షో ఢీలో బుల్లితెర స్టార్ హైపర్ ఆదికి ఘోర అవమానం జరిగింది. షో జడ్జిగా వ్యవహరిస్తున్న హీరోయిన్ పూర్ణ నీకు సిగ్గుంటే వెళ్ళిపో అని వార్నింగ్ ఇవ్వడం కలకలం రేపుతోంది. షోలో పదుల సంఖ్యలలో జనాలు ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మల్లెమాల నిర్మాణంలో చాలా కాలంగా ఢీ డాన్స్ రియాలిటీ షో సాగుతుంది. ప్రస్తుతం ఢీ 14 ఈటీవీలో ప్రసారమవుతుంది. ప్రియమణి, గణేష్ మాస్టర్ జడ్జెస్ గా వ్యవహరిస్తున్నారు. అప్పుడప్పుడు శ్రద్దా దాస్ సైతం సందడి చేస్తున్నారు. కారణం తెలియదు కానీ ప్రియమణి షోకి రావడం లేదు. దీంతో సీజన్ 13 జడ్జిగా ఉన్న పూర్ణ రీఎంట్రీ ఇచ్చారు.

లేటెస్ట్ ఎపిసోడ్ కి పూర్ణ, యాని మాస్టర్, గణేష్ మాస్టర్ జడ్జెస్ గా వ్యవహరించారు. షో చివరి దశకు చేరింది. సెమీ ఫైనల్స్ లో కంటెస్టెంట్స్ హోరా హోరీగా తలపడుతున్నారు. కాగా మధ్యలో డాన్సర్ శ్వేత-హైపర్ ఆదికి పోటీ పెట్టారు. వారిద్దరికీ ఫేస్ ఆఫ్ అంటూ.. నీతోనే డాన్స్ టు నైట్ పాటకు డాన్స్ చేయాలని చెప్పడం జరిగింది. మొదట శ్వేతా పెర్ఫార్మ్ చేసింది. తర్వాత హైపర్ ఆది డాన్స్ చేశాడు.
ఇద్దరినీ పక్క పక్కన నిల్చోబెట్టి యాంకర్ ప్రదీప్ జడ్జిమెంట్ అడిగాడు. హైపర్ ఆది-శ్వేతలలో ఎవరు బాగా పెర్ఫార్మ్ చేశారో చెప్పాలన్నారు. జడ్జి పూర్ణ శ్వేతా బాగా చేసిందని చెప్పింది. పూర్ణ కామెంట్ కి హైపర్ ఆది వెంటనే రియాక్ట్ అయ్యాడు. ఫస్ట్ టైం మీ జడ్జిమెంట్ నాకు నచ్చలేదు. మీది రాంగ్ జడ్జిమెంట్ అని చేతిలో ఉన్న బాటిల్ విసిరేసి వేదికపై నుండి క్రిందకు వచ్చేశాడు. హైపర్ ఆది అలా అనడంతో ఫీలైన పూర్ణ… నువ్వు అలా బిహేవ్ చేయకూడదు అన్నారు.

హైపర్ ఆది జడ్జి పూర్ణ నాకు యాక్టింగ్ రాదు, డాన్స్ రాదు అని చెప్పాడు. నీకు సిగ్గుంటే ఇక్కడ నుండి వెళ్ళు లేదంటే ఉండు అంటూ పూర్ణ దారుణమైన కామెంట్స్ చేసింది. నాకు సిగ్గు లేదు, సిగ్గు రాదు, నా సిగ్గు ఎలా ఉంటుందో భవిష్యత్ లో చూస్తావని హైపర్ ఆది పూర్ణకు కౌంటర్ ఇచ్చాడు. మళ్ళీ పూర్ణ ఆదిని నోరుమూసుకో అంది. నాకు నోరు లేదని పూర్ణను ఆది వెక్కిరించాడు. ఈ డిస్కషన్ జరుగుతుండగా సెట్ లో ఉన్నవారందరూ నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో పూర్ణ, ఆది సీరియస్ గా ఆ వ్యాఖ్యలు చేసుకున్నారా? లేక ఎపిసోడ్ కి హైప్ తేవడం కోసం చేశారా? అనే సందేహం మొదలైంది. ఆ విషయం తెలుసుకోవాలంటే ఢీ 14 నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలి.