
Heroine Poorna: హీరోయిన్ పూర్ణకు నేడు డెలివరీ అయ్యింది. ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. తల్లీ బిడ్డా ఆరోగ్యంగా ఉన్నారు. పూర్ణ తనకు పురుడు పోసిన డాక్టర్స్ టీమ్ కి ధన్యవాదాలు తెలిపారు. దుబాయ్ లో గల ఆస్టర్ హాస్పిటల్ లో పూర్ణకు ప్రసవం జరిగింది. ఇక పూర్ణ అబ్బాయికి జన్మనిచ్చారన్న విషయం తెలుసుకున్న అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చిత్ర ప్రముఖులు సైతం ఆమెకు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు.
పూర్ణ 2022 జూన్ నెలలో వివాహం చేసుకున్నారు. పూర్ణ భర్త పేరు షానిద్ అసఫ్ అలీ. దుబాయ్ లో వ్యాపారవేత్త. వీరి వివాహం ఒకింత నిరాడంబరంగా జరిగింది. పూర్ణకు పెళ్లి జరిగిన విషయం ఎవరికీ తెలియదు. ఎంగేజ్మెంట్ గురించి చెప్పిన పూర్ణ, పెళ్లి విషయం దాచారు. పెళ్లి ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పెట్టలేదు. ఒక దశలో పెళ్లి క్యాన్సిల్ అయ్యిందంటూ పుకార్లు వినిపించాయి.

పెళ్ళైన కొన్నాళ్లకు మేటర్ బయట పెట్టారు. దాంతో అందరూ షాక్ అయ్యారు. ఇక రోజుల వ్యవధిలో గర్భం దాల్చారు. ఓ అబ్బాయికి తల్లయ్యారు. పూర్ణ తెలుగులో హీరోయిన్ గా సీమటపాకాయ్, అవును వంటి హిట్ చిత్రాల్లో నటించారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో చిత్రాలు చేశారు. పూర్ణ కేరళకు చెందిన హీరోయిన్.
హీరోయిన్ గా ఫేడ్ అవుట్ అయిన పూర్ణ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. దృశ్యం 2 లో పూర్ణ లాయర్ రోల్ చేశారు. ఇక బాలయ్య బ్లాక్ బస్టర్ అఖండ మూవీలో గవర్నమెంట్ అధికారి పాత్రలో మెప్పించారు. లేటెస్ట్ సూపర్ హిట్ దసరా చిత్రంలో వదినమ్మగా కీలక పాత్రలో పూర్ణ కనిపించారు. కొద్దిరోజుల ముందు పూర్ణ నిండు గర్భంతో ‘చమ్కీల అంగీలేసి’ సాంగ్ కి డాన్స్ చేశారు. ఈ వీడియో వైరల్ కాగా పూర్ణపై నెటిజెన్స్ మండిపడ్డారు. నిండు గర్భంతో డాన్స్ చేస్తారా? అంటూ అసహనం వ్యక్తం చేశారు. పూర్ణ ఢీ డాన్స్ రియాలిటీ షోతో పాటు జబర్దస్త్ జడ్జిగా కూడా వ్యవహరించారు.