Jabardasth Varsha
Jabardasth Varsha: జబర్దస్త్ వర్ష ఫోటోలపై నెటిజెన్స్ దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజెన్ హద్దుమీరి ఆమె క్యారెక్టర్ ని కించపరుస్తూ కామెంట్ చేశాడు. వర్ష తరచుగా ఫోటో షూట్స్ చేస్తుంటారు. అవి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తుంటారు. ఆమెకంటూ ఓ అభిమానగణం ఉంది. రెగ్యులర్ గా వర్ష పోస్ట్స్ ఫాలో అవుతుంటారు. ఆమె గ్లామర్ ఆస్వాదిస్తూ మీరు బ్యూటిఫుల్, సూపర్ గార్జియస్ అంటూ పాజిటివ్ కామెంట్స్ చేస్తుంటారు. కొందరు మాత్రం పచ్చి బూతులతో రెచ్చిపోయి రచ్చ చేస్తారు. వర్ష మనసు హర్ట్ అయ్యేలా కామెంట్స్ పెడుతుంటారు.
నేడు వర్ష కొంచెం బోల్డ్ ఫోటో షూట్ చేశారు. స్కర్ట్ ధరించి థైస్ చూపిస్తూ గ్లామరస్ గా కనిపించారు. పలువురు చాలా బాగున్నారని కామెంట్స్ పెట్టారు. ఒకరు వర్షను తన కామెంట్ తో హర్ట్ చేశాడు. ‘తుపాకీ… ఎవరు డబ్బులు ఇస్తే వాడితో’ అంటూ దారుణమైన కామెంట్ పోస్ట్ చేశాడు. మరొక నెటిజెన్ ‘నీకు ఇలాంటి డ్రెస్సులు సెట్ కావని’ నెగిటివ్ కామెంట్ పెట్టాడు. ఈ కామెంట్స్ వర్షను విపరీతంగా బాధపెట్టి ఉంటాయనడంలో సందేహం లేదు.
Jabardasth Varsha
సోషల్ మీడియాలో సెలెబ్రెటీలకు వేధింపులు కామనే. ఇంతకంటే దారుణమైన క్రిటిసిజం ఫేస్ చేసే వాళ్ళు ఉన్నారు. అనసూయ, రష్మీ లాంటి యాంకర్స్ ఏళ్లుగా ఇలాంటి వేధింపులు ఎదుర్కుంటున్నారు. రష్మీ చూసి చూడనట్లు పోతుంది. అనసూయ మాత్రం సహించదు. హద్దు మీరి ట్రోల్ చేస్తే సైబర్ క్రైమ్ విభాగంలో కంప్లైంట్ చేస్తారు. ఇప్పటికే చాలా మంది చేత ఆమె ఊచలు లెక్క పెట్టించారు.
వర్ష చాలా సాఫ్ట్. ఇలాంటి కామెంట్స్ పై ఆమె స్పందించిన దాఖలాలు లేవు. గతంలో ట్రోలింగ్ తట్టుకోలేక జబర్దస్త్ మానేశారు. ఇమ్మానియేల్ తో వర్ష లవ్ ట్రాక్స్ వైరల్ అయ్యాయి. వీటిని ఉద్దేశిస్తూ యూట్యూబ్ లో విపరీతమైన ట్రోలింగ్ జరిగిందట. ఆ కామెంట్స్ చూసిన వర్ష తమ్ముడు ఆమెను నిలదీశాడట. జబర్దస్త్ షోలో ఈ విషయం చెప్పి బాధపడ్డ వర్ష… మానేస్తున్నాను అన్నారు. చెప్పినట్లే కొన్నాళ్ళు వర్ష షోకి దూరమయ్యారు.
Jabardasth Varsha
కొంచెం గ్యాప్ ఇచ్చి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం వర్ష జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోల్లో సందడి చేస్తున్నారు. బుల్లితెర ప్రేక్షకుల్లో వర్షకు అంటూ ఓ గుర్తింపు దక్కింది. అందుకే ఆమెకు మేకర్స్ ఆఫర్స్ ఇస్తున్నారు. ఇప్పటికి కూడా ఇమ్మానియేల్ తో ఆమె బుల్లితెర రొమాన్స్ ఆగలేదు. సుధీర్-రష్మీ వలె ఇమ్మానియేల్-వర్ష బుల్లితెర లవర్స్ గా అవతరించారు.