Homeట్రెండింగ్ న్యూస్Pigeon Droppings: కిల్లింగ్‌ బర్డ్స్‌.. శాంతి కపోతం చంపేస్తోంది..!

Pigeon Droppings: కిల్లింగ్‌ బర్డ్స్‌.. శాంతి కపోతం చంపేస్తోంది..!

Pigeon Droppings: శాంతికి చిహ్నంగా భావించే పావురాలు ప్రమాదకరంగా మారుతున్నాయ. కరోనా నుంచి కోలుకున్న వారికి మృత్యపాశంగా మారుతున్నాయి. పావురాల విసర్జన కరోనా నుంచి కోలుకున్నవారిలో మళ్లీ ఇన్‌ఫెక్షన్‌కు కారణమవుతున్నాయి. ఊపిరితిత్తులను దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా మృత్యువాత పడుతున్నారు. ఇందుకు తాజాగా జరిగిన నటి మీనా భర్త విద్యాసాగర్‌ మృతే ఉదాహరణ అని చెబుతున్నారు.

Pigeon Droppings
Pigeon Droppings

పావురాలు ప్రమాదకరమే..
పావురాలు చూడగానే ముచ్చటేస్తుంది. ముద్దనిపిస్తాయి. గుప్పెడు గింజలు వేస్తే మన దగ్గరకూ వస్తాయి. మనుషులతో మమేకమై, వవాసాల్లోనే గూడుకట్టుకుని నివసిస్తాయి. అయితే పావురాలు ప్రమాదకరమని మొదటి నుంచి అభిప్రాయం ఉంది. వైద్యులు, శాస్త్రవేత్తలు కూడా దీనిని ధ్రువీకరనించారు. పావురాలతోపాటు పక్షులకు ప్రత్యేమూత్ర విసర్జన వ్యవస్థ ఉండదు. అయితే అన్ని పక్షులకంటే పావురాలు విసర్జించే వ్యర్థాలు అత్యంత ప్రమాదకరంగా మారుతున్నాయి. ఈ వ్యర్థాల నుంచి వచ్చే ఇన్‌ఫెక్షన్‌ కలిగించే క్రిములు మనిషి ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతాయని వైద్యులు నిర్ధారించారు. అందుకే ఇళ్లలో పావురాలు పెంచడం ప్రమాదకరమని ప్రకటించారు. దీంతో చాలామంది పావురాల పెంపకం ఆపేశారు.

Also Read: Sammathame 6 Days Collections: ‘సమ్మతమే’ ఇక కష్టమే.. ఎన్ని కోట్లు నష్టం అంటే ?

ప్రావులపై ప్రేమ విద్యాసాగర్‌ ప్రాణం తీసింది..
నటి మీనా భర్త విద్యాసాగర్‌తోపాటు మీన, వారి కూతురు జనవరిలో కోవిడ్‌ బారిన పడ్డారు. చికిత్స తర్వాత అందరూ కోలుకున్నారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అయిన విద్యాసాగర్‌కు పావురాలంటే చాలా ఇష్టం. చాలాకాలంగా వాటితో సన్నిహితంగా ఉంటున్నారు. నిత్యం పావురాలకు ఆహారంగా గింజలు వేయడం ఆయనకు అలవాటు కూడా. కరోనా తర్వాత పావురాలతో ఉన్న సాన్నిహిత్యం తగ్గించాలని వైద్యులు సూచించారు. కానీ విద్యాసాగర్‌ వాటిని పెడచెవిన పెట్టినట్ల తమిళ మీడియా కథనం ప్రచురించింది. ఇదే ఆయనకు ముప్పుగా మారిందని పేర్కొంది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ పావురాలకు గింజలు వేయడం, వాటికి అత్యంత సన్నిహితంగా ఉండడంతో పోస్ట్‌ కోవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ ఎక్కువ అయిందని వైద్యులు భావిస్తున్నారు. దీంతో ఆయన ఊపిరితిత్తులు పూర్తిగా చెడిపోయాయని పేర్కొంటున్నారు. ఆస్పత్రిలో చేరిన విద్యాసాగర్‌ ఊపిరి తిత్తులు మారిస్తేగాని బతికే పరిస్థితి లేనందగా అతడి ఆరోగ్యం దిగజారింది. చనిపోయిన వ్యక్తి ఊపిరితిత్తుల కోసం మీనా, విద్యాసాగర్‌ కుటంబ సభ్యులు అన్వేషిస్తుండగానే మృత్యువు కబళించింది. నటి మీనా కుటుంబంలో తీరని విషాదం నిపింది.

Pigeon Droppings
actress meena husband vidyasagar

హైదరాబాద్‌ వాసుల్లో ఆందోళన..
పావురాలు ప్రాణాలు తీస్తున్నాయని, విద్యాసాగర్‌ మృతికి పావురాలే కారణమనే వార్తలు పత్రికలు, ఎలక్ట్రానిక్‌ మీడియాతోపాటు సోషల్‌ మీడియాలోనూ వార్తలు వైరల్‌ అవుతున్నాయి. దీంతో పావురాలు ఎక్కువగా ఉండే హైదరాబాద్‌ నగర్‌ వాసులు ఆందోళన చెందుతున్నారు. నగర వాసులు ఏళ్లుగా పావురాలతో కలిసే జీవనం సాగిస్తున్నారు. పాత బస్తీలో పావురాల సంఖ్య భారీగా ఉంది. ఈ నేపథ్యంలో కోవిడ్‌ నుంచి కోలుకున్న వారిలో ఆందోళన మరింత ఎక్కువైంది. అయితే వైద్యులు మాత్ర అందరిపై ప్రభావం ఉండదని, ఆమాటకొస్తే పక్షుల వ్యర్థాలన్నీ ప్రమాదకరమే అని పేర్కొంటున్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని సూచిస్తున్నారు.

Also Read:Naga Chaitanya Loved Before Samantha: సమంత కి ముందు నాగ చైతన్య ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసా?

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version