
Naga Chaitanya- Daksha Nagarkar: హీరోయిన్ దక్షా నగర్ అక్కినేని హీరో నాగ చైతన్యను ఉద్దేశిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తనను కిస్ చేసిన నాగ చైతన్య తర్వాత సారీ చెప్పాడని ఆమె అనడం పరిశ్రమ వర్గాలో చర్చకు దారి తీసింది. హోరా హోరీ మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన దక్షా నగర్… వరుసగా హుషారు, జాంబిరెడ్డి, బంగార్రాజు చిత్రాల్లో నటించారు. 2022 సంక్రాంతి కానుకగా విడుదలైన బంగార్రాజు మూవీ సూపర్ హిట్ కొట్టింది. కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా చేశారు.
బంగార్రాజు మూవీలో దక్షా నగర్ స్పెషల్ సాంగ్ లో నాగ చైతన్య పక్కన ఆడిపాడారు. నాగ చైతన్యతో ఆమె షూటింగ్ చేసింది కొద్దిరోజులే. అయినా చైతూ మీద వల్లమాలిన అభిమానం చూపిస్తుంది. నాగ చైతన్య వెరీ స్వీట్ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతుంది. రీసెంట్ ఇంటరాక్షన్ లో దక్షా నగర్ ని చైతూ గురించి అడగ్గా… నాగ చైతన్యు వెరీ సీట్ పర్సన్. చైతూని ప్రతి అమ్మాయి ఇష్టపడుతుంది. చెప్పాలంటే అమ్మాయిలకు చైతూ క్రష్. చాలా కేరింగ్ గా చూసుకుంటాడు. ఆడవాళ్లను బాగా గౌరవిస్తాడు.
బంగార్రాజు మూవీ షూటింగ్ జరిగేటప్పుడు నన్ను ముద్దాడేందుకు, కౌగిలించుకునేందుకు తెగ ఇబ్బందిపడ్డాడు. చిత్రీకరణ ముగిశాక నా దగ్గరకు వచ్చి సారీ చెప్పాడు. అంత మంచి అబ్బాయి చైతూ… అని ప్రశంసల జల్లు కురిపించింది. అసలు షూటింగ్ లో భాగంగా ముద్దు పెట్టుకుంటే చైతు సారీ చెప్పడమేంటని అందరూ వాపోతున్నాడు. బహుశా ఆ షాట్ కోసం చైతూ ఎక్కువ టేక్స్ తీసుకున్నాడేమో అని చిలిపిగా అంచనా వేస్తున్నారు.

మరోవైపు నాగ చైతన్య మీద ఎఫైర్ రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. లండన్ లో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న చైతు, శోభిత ధూళిపాళ్ల అడ్డంగా బుక్ అయ్యారు. వీరి విహారాలకు సంబంధించిన ఫోటో ఒకటి లీక్ కాగా మేటర్ క్లియర్ గా అర్థమైంది. చాలా కాలంగా వీరిపై ఎఫైర్ రూమర్స్ ఉన్నాయి. తాజా సంఘటనతో అనుమానాలు బలపడ్డాయి.
ఇక నాగ చైతన్య సమంతకు 2021లో విడాకులు ఇచ్చారు. ఇటీవల సమంత విడాకుల కారణాలపై సుచాయిగా హింట్ ఇచ్చారు. వివాహ బంధంలో నేను వంద శాతం నిజాయితీగానే ఉన్నాను. అయినా వర్క్ అవుట్ కాలేదు. అందుకే ఆ బంధాన్ని వదిలేశాను. తప్పు చేయనప్పుడు నేను శిక్ష ఎందుకు అనుభవించాలి? ఎందుకు దాక్కోవాలి? అని పరోక్షంగా చైతూ మీద విమర్శలు గుప్పించారు. చైతూ మాత్రం ఇంత వరకు ఏ రూపంలో విడాకులపై స్పందించలేదు.
• Men Will Be Men #NagaChaitanya || #Bangarraju #BangarrajuOnJan14th pic.twitter.com/J6xaQf9GZT
— ChayAkkineni ™ (@MassChayCults) January 10, 2022